Supreme Court: కోర్టులపై చీఫ్‌ జస్టీస్‌ డీవై చంద్రచూడ్‌ కీలక వ్యాఖ్యలు

కోర్టుల విధానాలతో ప్రజలు విసిగిపోయారని.. సత్వర పరిష్కారాలు కోరుకుంటున్నారని చీఫ్ జస్టీస్ డీవై చంద్రచూడ్ అన్నారు. సుప్రీంకోర్టు 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ప్రత్యేక లోక్‌ అదాలత్ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

New Update
Supreme Court: కోర్టులపై చీఫ్‌ జస్టీస్‌ డీవై చంద్రచూడ్‌ కీలక వ్యాఖ్యలు

భారత ప్రధాన న్యాయమూర్థి (CJI) జస్టీస్ డీవై చంద్రచూడ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. కోర్టుల విధానాలతో ప్రజలు విసిగిపోయారని.. సత్వర పరిష్కారాలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని వారం రోజుల పాటు ప్రత్యేక లోక్‌ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. చివరిరోజున ఆయన మాట్లాడారు. ప్రజలు కోర్టుల ప్రక్రియతో విసిగిపోయారని.. వాళ్లు వెంటనే పరిష్కారాలు కోరుకుంటున్నారని అన్నారు.

Also Read: కానిస్టేబుల్ అభ్యర్థులకు తప్పని నిరాశ.. మరో ఏడాది ఆగాల్సిందేనా?

అలాగే లోక్‌ అదాలత్ ఏర్పాటుకు బార్, బెంచ్ సభ్యుల సహాకారం లభించిందని పేర్కొన్నారు. లోక్‌అదాలత్‌లో న్యాయవాదులను భాగస్వాములను చేయాలనే ఉద్దేశంతో ఇద్దరు బార్ సభ్యులతో పాటు ఇద్దరు న్యాయవాదులతో ధర్మాసనం ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజల వద్దకే న్యాయం వెళ్లాలనే ముఖ్య ఉద్దేశమే లోక్‌ అదాలత్‌లని పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న కేసులు తగ్గించడమే దీని లక్ష్యమని స్పష్టం చేశారు. ఇదిలాఉండగా లోక్ అదాలత్‌లు అనేవి న్యాయస్థానాల్లో లేదా వ్యాజ్యానికి ముందు దశలో పెండింగ్‌లో ఉన్న వివాదాలను, కేసులు సామరస్యంగా పరిష్కరించబడే లేదా రాజీ చేసుకునే వేదికలు.

Advertisment
తాజా కథనాలు