China: అమ్మో.. చైనా వద్ద 500 అణు వార్‌హెడ్‌లు.. సంచలన విషయాలు బయటపెట్టిన పెంటగాన్.. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. ఏ సమయానికి ఏ దేశాలు దాడికి దిగుతాయో తెలియదు. అందుకే చాలా దేశాలు తమ రక్షణ రంగానికి భారీగా నిధులు కేటాయిస్తుంటాయి. ముఖ్యంగా అమెరికా, చైనా, యూకే, జర్మని, భారత్‌తో పాటు పలు దేశాలు అధికంగా తమ సైన్యానికి ఖర్చు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం చైనా సైన్యం భారీగా అణ్వాయుధాలను సమకూర్చుకుంటోంది. 2021తో పోల్చుకుంటే.. వీటి సంఖ్య 100 పెరిగినట్లు సమాచారం. డ్రాగన్ వద్ద ఇప్పుడు 500 వరకు అణు వార్‌హెడ్‌లు వినియోగించేందుకు సిద్ధంగా ఉన్నాయి. వీటి సంఖ్య 2030కి 1000కి చేరే అవకాశం ఉండనున్నట్లు పెంటగాన్ వెల్లడించింది. By B Aravind 22 Oct 2023 in ఇంటర్నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి చాలా దేశాలు తమ రక్షణ కోసం సైన్యానికి భారీగా నిధులు కేటాయిస్తుంటాయి. అమెరికా, రష్యా, చైనా, యూకే, జర్మని, ఫ్రాన్స్, భారత్‌తో సహా మరికొన్ని దేశాలు ఈ విధానాన్ని అనుసరిస్తున్నాయి. ఆఖరికి ఉత్తర కొరియాలో ఆకలి కేకలు ఉన్నప్పటికీ కూడా.. ఆ దేశం రక్షణ వ్యవస్థ కోసమే అధికంగా ఖర్చులు చేస్తోంది. అయితే ఇప్పుడు చైనా సైన్యం భారీగా అణ్వాయుధాలను సమకూర్చుకుంటోంది. 2021తో పోల్చుకుంటే.. వీటి సంఖ్య ఏకంగా 100 వరకు పెరిగినట్లు గుర్తించారు. ప్రస్తుతం చైనా సైన్యంలో జరుగుతున్న కొన్ని పరిణామాలపై అమెరికాకు చెందిన పెంటగాన్ తమ వార్షిక నివేదికలో వెల్లడించింది. డ్రాగన్ వద్ద ఇప్పుడు 500 వరకు అణు వార్‌హెడ్‌లు వినియోగించేందుకు సిద్ధంగా ఉన్నాయి. అయితే వీటి సంఖ్య 2030 నాటికి 1000కి చేరే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఇప్పుడు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వద్ద 300 ఖండాంతర క్షిపణులు భూగర్భ బొరియల్లో రెడీగా ఉన్నాయి. దేశంలోని మూడు ప్రదేశాల్లో క్షిపణులు మోహరించేందుకు వీలుగా భూగర్భ బొరియలను గత ఏడాదే నిర్మించారు. దీంతో సంప్రదాయ వార్‌హెడ్‌లను ప్రయోగించేందుకు ఖండాంతర క్షిపణి వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసింది డ్రాగన్.చివరకీ విదేశాల్లో కూడా తమ మిలటరీ బేస్‌లను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది డ్రాగన్. బర్మా, థాయ్‌లాండ్, ఇండోనేసియా, యూఏఈ, కెన్యా, నైజీరియా, నమీబియా, మొజాంబిక్, బంగ్లాదేశ్ సహా పలు దేశాల్లో లాజిస్టిక్స్ కేంద్రాలు ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని పెంటగాన్ తెలిపింది. ఇక చైనా నౌకాదళంలో చూసుకుంటే ఏడాది వ్యవధిలోనే 30 కొత్త షిప్‌లను చేర్చింది. అప్పటినుంచి ప్రపంచంలోనే అత్యధికంగా 370 యుద్ధ నౌకలు ఉన్న దేశంగా డ్రాగన్ నిలిస్తోంది. అయితే ఈ సంఖ్య 2025 నాటికి 395 అలాగే.. 2030 నాటికి 435కు పెరగవచ్చు. మరోవైపు.. భారత్ సరిహద్దున ఉన్న వాస్తవాధీన రేఖ వద్ద కూడా చైనా పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపట్టినట్లు పెంటగాన్ తన నివేదికలో చెప్పింది. అండర్‌గ్రౌండ్ స్టోరేజీలు, కొత్త రోడ్లు, అలాగే సైనిక-పౌర వినియోగానికి ఎయిర్ పోర్టులు, భారీ సంఖ్యలో హెలిప్యాడ్లను సైతం నిర్మిస్తోందని తెలిపింది. ఇక భూటాన్ సరిహద్దుల్లో కూడా వివాదాస్పద ప్రాంతానికి దగ్గర్లో గ్రామాల నిర్మాణాన్ని చేపట్టింది. 2022లో వాస్తవాధీన రేఖ వద్ద ఒక సరిహద్దు రెజిమొంట్‌ను మోహరించింది. అయితే దీనికి మద్దతుగా షింజియాంగ్, టిబెట్ మిలటరీ డిస్ట్రిక్స్‌కు చెందిన రెండు డివిజన్లు పనిచేస్తున్నాయి. అలాగే వీటితో సహా.. నాలుగు కంబైన్డ్ ఆర్మ్స్ బ్రిగేడ్లను రిజర్వులో ఉంచింది డ్రాగన్. #china #china-army #china-news #military #china-military #china-defence మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి