Telangana e-Challan: రాష్ట్రంలో వాహనాల రాయితీ పెండింగ్ చలాన్ల (Pending Challans) వల్ల ప్రభుత్వానికి ఆదాయం భారీగా సమకూరింది. మొత్తం 3.59 కోట్లు పెండింగ్ చలాన్లు ఉండగా.. ఇప్పటిదాకా 1,52,47,864 మంది చలాన్లను చెల్లించారు. ఇప్పటివరకు కేవలం 42.38 శాతం చలాన్లకు చెల్లింపులు జరిగాయి. వీటినుంచి రాష్ట్రానికి రూ.135 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు చెప్పారు. హైదరాబాద్ కమీషనరేట్ పరిధిలో రూ.34 కోట్లు రాగా.. సైబరాబాద్ పరిధిలో రూ.25 కోట్లు వచ్చాయి. ఇక రాచకొండ పరిధిలో రూ.16 కోట్ల ఆదాయం వచ్చింది.
Also Read: పదేళ్ల కేసీఆర్ కుట్రలకు తెలంగాణ ప్రజలు బలయ్యారు
అయితే ఈ రాయితీలను చెల్లించేందుకు మరో 4 రోజులు మాత్రమే గడువు ఉందని.. ఈలోపు వాహనాదారులు పెండింగ్‌లో ఉన్న తమ చలాన్లను చెల్లించాలని పోలీసులు సూచనలు చేస్తున్నారు. అయితే గతేడాది డిసెంబర్ 27 నుంచి పెండింగ్ చెలాన్లను చెల్లించేందుకు 15 రోజుల పాటు అవకాశం కల్పించారు. ఆ తర్వాత చెల్లింపులకు సంబంధించి సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో జనవరి 31 వరకు గడువు తేదీని పొడగించింది రాష్ట్ర సర్కార్. అయితే ఈసారి గడువు ముగిసిన తర్వాత మళ్లీ పొడగించే అవకాశం లేదని.. అధికారులు స్పష్టం చేశారు. జనవరి 31 లోపు చెల్లించాలంటూ చెబుతున్నారు.
Also Read: రేపు సా.4గంటలకు బీహార్ సీఎంగా నితీష్ ప్రమాణస్వీకారం