పాదచారులకు సుప్రీం కోర్టు షాక్.. అక్కడ నడవొద్దని వార్నింగ్

హైవేలపై నడిచే పాదచారులకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. వారి భద్రత విషయంలో దాఖలు చేసిన ఓ పిటిషన్‌ను కొట్టేసింది. దేశంలో హైవేలు పెరిగాయి.. కానీ మనలో క్రమశిక్షణ పెరగలేదని హితవు పలికింది. నిబంధనలను ఉల్లంఘించిన వారిని కోర్టు సమర్థించలేదని స్పష్టం చేసింది.

పాదచారులకు సుప్రీం కోర్టు షాక్.. అక్కడ నడవొద్దని వార్నింగ్
New Update

దేశ వ్యాప్తంగా ఉన్న రహాదారులపై పాదచారులు తిరగకూడదని సుప్రీం కోర్టు హితవు పలికింది. హైవేలపై పాదచారుల భద్రత అంశాన్ని లేవనెత్తుతూ దాఖలైన ఓ పిటిషన్‌ను స్వీకరించేందుకు నిరాకరించింది. వాహనాల రాకపోకలకు ఉద్దేశించిన హైవేల ఈ మేరకు క్షమశిక్షణ అవసరమని పేర్కొంది. ఇదే అంశంపై పిటిషనర్లు తొలుత గుజరాత్‌ హైకోర్టును ఆశ్రయించారు. అయితే, ఆ పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు.. ఈ వ్యవహారంపై కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖను సంప్రదించాలని సూచించింది. దీంతో గుజరాత్‌ హైకోర్టు ఆదేశాలను సవాల్‌ చేస్తూ పిటిషనర్లు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే ఈ వ్యాజ్యాన్ని జస్టిస్‌ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్‌ సుధాన్షు ధులియాలతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం సోమవారం పరిశీలించి పలు సూచనలు చేసింది.

Also read :లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జనగామ మున్సిపల్‌ కమిషనర్‌

ఈ మేరకు అసలు హైవేపైకి పాదచారులు ఎలా వస్తారు? వారికి క్రమశిక్షణ ఉండాలి. వారు హైవేలపై తిరగకూడదు. ప్రపంచంలో ఎక్కడా ఇలా తిరిగే వ్యక్తులు కనిపించరు. భవిష్యత్తులో పాదచారుల కోసం హైవేలపై వాహనాలను ఆపాలని కూడా కోరతారు. అదెలా సాధ్యమవుతుందని పిటిషన్‌దారులను ధర్మాసనం ప్రశ్నించింది. హైవేలపై పాదచారులకు సంబంధించిన రోడ్డు ప్రమాదాలు భారీగా పెరిగాయని పిటిషన్‌దారుల తరఫు న్యాయవాది వాదించగా.. పాదచారులు ఉండకూడని చోట ఉంటే ఇలాంటి ఘటనలు జరుగుతాయని స్పష్టం చేసింది. ఇది పూర్తిగా అసంబద్ధ పిటిషన్. వాస్తవానికి దీనికి జరిమానా విధించాల్సింది. ఏదేమైనా.. సంబంధిత మంత్రిత్వ శాఖను సంప్రదించేందుకు హైకోర్టు మీకో అవకాశం ఇచ్చిందని పిటిషన్‌దారులను ఉద్దేశించి సుప్రీం ధర్మాసనం పేర్కొంది. ఈ క్రమంలోనే 'దేశంలో హైవేలు పెరిగాయి.. కానీ మనలో క్రమశిక్షణ పెరగలేదు'అని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.

#supreme-court #roads #pedestrians
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe