Pedarayudu dhoti: రజనీకాంత్, మోహన్‌ బాబు ధరించిన 'పెదరాయుడు పంచె'కు అరుదైన గుర్తింపు!

పెదరాయుడు సినిమాలో మోహన్‌బాబు, రజినీకాంత్ ధరించిన 'ధోతీ'కి అరుదైన గుర్తింపు రానుంది. ఈ ధోతీకి 'జీఐ' ట్యాగ్ కోసం పెద్దాపురం కాటన్ అండ్ సిల్క్ హ్యాండ్లూమ్ వీవర్స్, పులుగుర్త హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ ప్రొడక్షన్ చెన్నై GI రిజిస్ట్రీకి దరఖాస్తు చేశాయి.

New Update
Pedarayudu dhoti: రజనీకాంత్, మోహన్‌ బాబు ధరించిన 'పెదరాయుడు పంచె'కు అరుదైన గుర్తింపు!

1995లో రిలీజైన పెదరాయుడు(Pedarayudu) సినిమా గుర్తింది కదా? ఈ మూవీ ఎంత పెద్ద హిటో అందరికి తెలుసు. ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన చిత్రం అది. కలెక్షన్‌ కింగ్ మోహన్‌ బాబు కెరీర్‌లో వన్‌ ఆఫ్‌ ది బిగెస్ట్‌ హిట్స్‌లో ఒకటి. తమిళ సూపర్‌ స్టార్‌ రజినీకాంత్ కూడా నటించిన ఈ సినిమా బాక్సాఫిస్‌ వద్ద వసూళ్ల నునామీని సృష్టించింది. ఇప్పటికీ ఈ సినిమా గురించి ప్రజలు చర్చించుకుంటుంటారు. టీవీలో మూవీ వస్తే చూడకుండా ఉండలేరు. అలాంటి బ్లాక్‌బస్టర్‌ సినిమాలో రజినీకాంత్‌తో పాటు మోహన్‌ బాబు ధరించిన పంచెకు అరుదైన గుర్తింపు దక్కింది.

పంచెకు 'జీఐ' ట్యాగ్‌:
పెదరాయుడు సినిమాలో రజినీకాంత్, మోహన్ బాబు ధరించిన కుప్పదం ధోతీని 'పెదరాయుడు ధోతి'గా పిలుస్తారు. ఈ ధోతీకి జీఐ ట్యాగ్‌ రానుందని సమాచారం. పెద్దాపురం కాటన్ అండ్ సిల్క్ హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ ప్రొడక్షన్ అండ్ సేల్స్ సొసైటీ లిమిటెడ్‌తో పాటు పులుగుర్త హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ ప్రొడక్షన్ అండ్ సేల్స్ సొసైటీ లిమిటెడ్ 'జీఐ' ట్యాగ్ కోసం చెన్నై GI రిజిస్ట్రీకి దరఖాస్తు చేశాయి.

సాంప్రదాయకంగా ఎక్కువగా ఇష్టపడే ధోతీ:
ఈ ధోతీ హిస్టరి తెలుసుకోవాలనుకుంటే తూర్పు గోదావరిలోని పందలపాకకు వెళ్లాలి. మగ్గం అటాచ్‌మెంట్లు, స్పన్ కాటన్ నూలు ఉపయోగించి ఈ కుప్పడం ధోతీలను నేసేవారు. 1996లో పెద్దాపురంలో పట్టు కుప్పడం ఉత్పత్తి ప్రారంభమైంది. కొన్నేళ్లుగా వీటిని పవర్‌లూమ్‌లపై తయారు చేస్తున్నారు. చౌకైన పవర్‌లూమ్ వస్తువులు ఉన్నప్పటికీ, చేనేత ప్రేమికులు ఇప్పటికీ సాంప్రదాయకంగా చేతితో నేసిన ఈ ఉత్పత్తిని ధరించడానికి ఇష్టపడతారు. ఈ నేత కార్మికులలో ఎక్కువ మంది దేవాంగ్ కమ్యూనిటీకి చెందినవారు ఉన్నారు. మొత్తం 95వాతం మంది ఈ కమ్యూనిటీవారే ఉన్నారు. వీరితో పాటు పద్మశాలి, కర్నాబట్టు, జంగా వర్గాలకు చెందిన కొందరు కూడా కుప్పడం ధోతి తయారీలో ఉన్నారు.

Also Read: ఐసీసీ టాప్‌ కిరీటాన్ని కింగ్‌ మళ్లీ అందుకుంటాడా? ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌ విడుదల!
WATCH:

Advertisment
తాజా కథనాలు