Paytm Fastag Deactivation : Paytm పేమెంట్స్ బ్యాంక్ సేవలను నిషేధిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) ఉత్తర్వులు జారీ చేసినప్పటి నుండి, కంపెనీ చాలా సమస్యలను ఎదుర్కొంటోంది. దీని నుంచి బయటపడి తన కస్టమర్ల ప్రయోజనాలను కాపాడేందుకు అది అన్ని విధాలా ప్రయత్నిస్తోంది. ఇప్పుడు ఇండియన్ హైవే మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్(IHMCL), పబ్లిక్ సెక్టార్ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) టోల్ కలెక్షన్ యూనిట్, 32 అధీకృత బ్యాంకుల నుండి ఫాస్టాగ్ సేవలను పొందాలని హైవే వినియోగదారులకు సూచించింది. అయితే, ఈ లిస్ట్ నుంచి NHAI తన Paytm బ్యాంక్‌ను తొలగించింది. Paytm పేమెంట్ బ్యాంక్ మార్చి 15 తర్వాత క్లోజ్ అవుతుంది. ఈ పరిస్థితుల్లో మనకు కనుక పేటీఎం ఫాస్టాగ్ ఉంటే.. దానికి ఫాస్ట్‌ట్యాగ్‌కు సంబంధించి మీకు ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం.
Paytm ఫాస్టాగ్ ఇప్పుడు ఏమవుతుంది?
మీరు Paytm ఫాస్టాగ్‌ని ఉపయోగిస్తుంటే, ఇప్పుడు దాన్ని ఉపయోగించలేరు. మీరు Paytm Fastag సర్వీస్ బదులుగా మరొక Fastag ను ఎంచుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ముందుగా మీరు Paytm యాప్ నుండి Paytm Fastag ని డియాక్టివేట్(Paytm Fastag Deactivation) చేయాలి. మీరు దీన్ని డీయాక్టివేట్ చేసిన తర్వాత, మీ ఫాస్టాగ్ ఖాతాను మరొక బ్యాంక్‌తో లింక్ చేసే అవకాశాన్ని Paytm మీకు అందిస్తుంది. ఆపై మీరు ఫాస్టాగ్‌ని అధీకృత బ్యాంక్‌తో లింక్ చేయడం ద్వారా దాన్ని ఉపయోగించడం కొనసాగించవచ్చు.
ఏ బ్యాంకులకు ఫాస్టాగ్ ఆప్షన్ ఉంది?
ఈ 32 అధీకృత బ్యాంకుల్లో ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సిటీ యూనియన్ బ్యాంక్, కాస్మోస్ బ్యాంక్. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, ఫినో పేమెంట్స్ బ్యాంక్, HDFC బ్యాంక్, ICICI బ్యాంక్, IDBI బ్యాంక్, IDFC ఫస్ట్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, J&K బ్యాంక్, కర్ణాటక బ్యాంక్, కరూర్ వైశ్య బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, నాగ్‌పూర్ నాగరిక్ కోఆపరేటివ్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, సరస్వత్ బ్యాంక్, సౌత్ ఇండియన్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, త్రిసూర్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలాగే యెస్ బ్యాంక్ ఉన్నాయి.
Also Read : షాకిచ్చిన బంగారం-వెండి ధరలు.. ఎంత పెరిగాయంటే..
కోట్లాది మంది పేటీఎం ఫాస్టాగ్‌ని ఉపయోగిస్తున్నారు
Paytm Fastag మొత్తం ఖాతాదారులలో పెద్ద యూజర్ బేస్ కలిగి ఉంది. ఇది దాదాపు 98 శాతం అంటే ఎనిమిది కోట్ల కంటే ఎక్కువ మంది వినియోగదారులను కలిగి ఉంది. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) సాంకేతికతతో కూడిన ఫాస్ట్‌ట్యాగ్, లింక్ అయినా బ్యాంక్ ఖాతాల నుండి నేరుగా హైవే టోల్ రుసుములను చెల్లించడానికి వినియోగదారులను అనుమతిస్తుంది.
Paytm ఫాస్టాగ్‌ని డీయాక్టివేట్ చేసి కొత్త ఫాస్టాగ్‌ని పొందే ప్రక్రియ ఇదే..
- ముందుగా మీ పేటీఎం యాప్ తెరవండి
- మీ ప్రొఫైల్ లోకి వెళ్ళండి
- తర్వాత ప్రొఫైల్ సెట్టింగ్స్ క్లిక్ చేయండి
- ఇక్కడ కనిపించే యాక్టివ్ పేటీఎం సర్వీసెస్ పై క్లిక్ చేయండి
- ఇక్కడ మీకు ఫాస్టాగ్ డీ యాక్టివేట్ చేసేందుకు ఆప్షన్ కనిపిస్తుంది
- దీనిమీద క్లిక్ చేయండి.. మీరు ఎందుకు ఫాస్టాగ్ డీయాక్టివేట్ చేయాలని అనుకుంటున్నారు అని వస్తుంది
- అక్కడ ఇచ్చిన ఆప్షన్స్ లో మీకు తగిన ఆప్షన్ సెలెక్ట్ చేయండి
- ఆ తరువాత కింద కనిపించే ప్రాసెస్ బటన్ పై క్లిక్ చేయండి
- ఇక్కడ మీకు క్లోజ్ ఫాస్టాగ్ అనే ఆప్షన్ వస్తుంది. దానిని క్లిక్ చేయండి
ఇక్కడితో మీ ఫాస్టాగ్ డీ యాక్టివేట్ ప్రాసెస్ అయిపోతుంది. తరువాత మీ ఫాస్టాగ్ లో ఉన్న బ్యాలెన్స్ ఎమౌంట్ 5-7 రోజుల్లో మీ పేటీఎం వాలెట్ కి వస్తుంది.
Also Read : ఛాన్స్ మిస్ కావద్దు.. బంగారం ధరలు చౌకగానే.. వెండి పెరిగింది.. ఎంతంటే..
కొత్త ఫాస్టాగ్ తీసుకోవాలంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. NHAI 32 బ్యాంకులకు ఫాస్టాగ్ జారీచేసే అవకాశం ఇచ్చింది. అంటే, మీరు ఈ బ్యాంకులలో దేనినుంచైనా ఫాస్టాగ్ తీసుకోవచ్చు. అన్నిటికన్నా మంచి మార్గం ఏమిటంటే, మీకు ఎకౌంట్ ఉన్న బ్యాంక్ నుంచి ఫాస్టాగ్ తీసుకోవడం. దీని ద్వారా మీ ఫాస్టాగ్ రీఛార్జ్ చేసుకోవడం కూడా ఈజీ అవుతుంది. మీరు వేరే బ్యాంక్ ఫాస్టాగ్ తీసుకుంటే, రీఛార్జ్ కోసం మళ్ళీ థర్డ్ పార్టీ యాప్స్ పై ఆధారపడాల్సి ఉంటుంది. ఇక పేటీఎం ఫాస్టాగ్ మీరు డీ యాక్టివేట్ చేసిన తరువాత పేటీఎం లో ఒక ఆప్షన్ ఇస్తున్నారు. దీని ద్వారా మీ ఫాస్టాగ్ ను మీరు వేరే బ్యాంక్ కు అక్కడి నుంచే లింక్ చేసుకోవచ్చు.
Watch this Interesting Video :