Gold Rate Today: బంగారం ధరలు వరుసగా తగ్గుతూ వచ్చి అందరిలోనూ ఆశలు రేపాయి. దీంతో బంగారం కొనాలని అనుకునేవారు ఊపిరి పీల్చుకున్నారు. అయితే, వారి ఆశలను చెరిపేస్తూ ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. అంతర్జాతీయంగా బంగారం ధరలు నిన్న పెరుగుదల కనపరిచాయి. దీంతో ఆ ప్రభావం ఈరోజు దేశీయంగానూ కనిపించింది. ఈ వారం అంతా దాదాపుగా తగ్గుతూనే వచ్చిన బంగారం ధరలు వారం చివరలో షాక్ ఇచ్చాయి. ఈరోజు అంటే ఫిబ్రవరి 17న బంగారం పెరుగుదల కనబరిచింది. బంగారం ధరల(Gold Rate Today) తగ్గుదల – పెరుగుదలపై చాలా అంశాలు ప్రభావం చూపిస్తాయి. అంతర్జాతీయంగా పరిస్థితులు అనిశ్చితంగా ఉండడం.. అలాగే అంతర్జాతీయంగా బంగారం ధరల్లో పెరుగుదల కనిపించడం .. స్థానికంగా పెళ్లిళ్ల సీజన్ మొదలు కావడంతో బంగారం డిమాండ్ పెరుగుతూ ఉండడం బంగారం ధరలపై ప్రభావం చూపించిందని నిపుణులు భావిస్తున్నారు. ఈరోజు అంటే ఫిబ్రవరి 17న అంతర్జాతీయ స్థాయిలో బంగారం ధర (Gold Rate Today)స్వల్పంగా పెరిగింది. దీంతో దేశీయంగాను బంగారం ధరలు పెరుగుదల నమోదు చేశాయి. మరోవైపు వెండి ధరలు వరుసగా రెండోరోజూ భారీగా పెరిగాయి. ఈరోజు అంటే శనివారం (ఫిబ్రవరి 17) మార్కెట్ ప్రారంభ సమయానికి బంగారం, వెండి ధరలు (Gold Rate Today) దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Gold Rate Today: షాకిచ్చిన బంగారం-వెండి ధరలు.. ఎంత పెరిగాయంటే..
వరుసగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు ఈరోజు పెరిగాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,100ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.62,290ల వద్దకు చేరాయి. ఇక వెండి ధర కేజీకి 1000 పెరిగి రూ.77,000 వద్ద ఉంది.
Translate this News: