Gold Rate Today: ఎప్పుడూ లేనివిధంగా బంగారం ధరలు వరుసగా తగ్గుతూ వస్తున్నాయి. నిన్న భారీగా 600 రూపాయల వరకూ తగ్గిన బంగారం ధరలు ఈరోజు కూడా స్వల్పంగా తగ్గుదల నమోదు చేశాయి. అంతర్జాతీయంగా బంగారం ధరలు స్వల్పంగా పెరుగుదల నమోదు చేసినప్పటికీ.. దేశీయంగా బంగారం ధరలు తగ్గడం గమనార్హం. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ పీక్స్ లో ఉంది. ఈ నేపథ్యంలో ధరలు తగ్గుతుండడంతో బంగారం కొనడానికి ఇదే మంచి సమయం అని చెప్పవచ్చు. బంగారం, వెండి ధరలు(Gold Rate Today) నిలకడగా ఉండేవి కావు.. అలానే ఇంకా తగ్గుతాయి అని కచ్చితంగా చెప్పేలా కూడా ఉండవు. ప్రస్తుతం అయితే, బంగారం ధరలు తగ్గుదల బాటలోనే ఉన్నాయి. బంగారం ధరల తగ్గుదల – పెరుగుదలపై చాలా అంశాలు ప్రభావం చూపిస్తాయి. అంతర్జాతీయంగా పరిస్థితులు అనిశ్చితంగా ఉండడం.. అలాగే అంతర్జాతీయంగా బంగారం ధరల్లో కాస్త పెరుగుదల ఉన్నప్పటికీ.. స్థానికంగా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో పసిడి ధరలు తగ్గుతున్నాయని నిపుణులు భావిస్తున్నారు. మొత్తమ్మీద బంగారం ధరలు(Gold Rate Today) ఇటీవలి కాలంలో ఇంత తగ్గుముఖం పట్టడం అనేది సామాన్యులకు కాస్త ఊరట ఇచ్చే అంశమని చెప్పవచ్చు. మరోవైపు వెండి ధరలు మాత్రం ఈరోజు కాస్త పెరుగుదల కనబరిచాయి. ఈరోజు అంటే శుక్రవారం (ఫిబ్రవరి 16) మార్కెట్ ప్రారంభ సమయానికి బంగారం, వెండి ధరలు దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
హైదరాబాద్ లో బంగారం ధరలు..
హైదరాబాద్(Hyderabad) లో బంగారం ధరలు కొద్దిగా (Gold Rate Today) తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం(Gold Rate Today) 100 రూపాయలు తగ్గి రూ.56,900ల వద్ద ఉంది. 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 110రూపాయలు తగ్గింది. దీంతో రూ. 62,070లకు దిగివచ్చింది.