/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/Paytm-Shares-jpg.webp)
Paytm and Paytm Payments Bank : Paytm మాతృ సంస్థ 'వన్ 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్' - Paytm పేమెంట్ బ్యాంక్ లిమిటెడ్(PPBL) అనేక ఒప్పందాలను రద్దు చేసుకోవడానికి పరస్పరం అంగీకారం కుదుర్చుకున్నాయి. PPBLపై ఆర్బీఐ నియంత్రణ చర్యల మధ్య పరస్పర ఆధారపడటాన్ని తగ్గించడానికి ఎంటిటీలతో వివిధ ఇంటర్-కంపెనీ ఒప్పందాలను రద్దు చేయడానికి కూడా గ్రూప్ అంగీకరించింది.
ఇది కాకుండా, షేర్ హోల్డింగ్ ఒప్పందాన్ని సరళీకృతం చేయడానికి కూడా అంగీకారం కుదిరింది. One 97 Communications Limited ఈ రోజు అంటే మార్చి 1న తన ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో దీని గురించి సమాచారాన్ని ఇచ్చింది. అంటే Paytm పేమెంట్ బ్యాంక్ - Paytm ఇక నుంచి వేరుగా స్వతంత్ర సంస్థలుగా పని చేస్తాయి.
షేర్లు జంప్..
ఈ వార్తల మధ్య వన్ 97 కమ్యూనికేషన్స్ షేర్లు 4% కంటే ఎక్కువ పెరిగాయి. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్.. పేటీఎం రెండూ విడివిడిగా పనిచేస్తాయని వార్తలు వచ్చిన వెంటనే వన్ 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ షేర్లు 4.17% పెరిగాయి. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో షేరు 17.50 పాయింట్ల లాభంతో రూ.420.80 వద్ద ట్రేడవుతోంది.
విజయ్ శేఖర్ రాజీనామా..
Paytm వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ ఈ వారం ఫిబ్రవరి 26న Paytm Payments Bank బోర్డు నుండి రాజీనామా చేశారు. ఆయన బ్యాంక్ పార్ట్ టైమ్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్. ఆయన రాజీనామా తర్వాత బ్యాంకు కొత్త బోర్డు ఏర్పాటైంది. Paytm పేమెంట్స్ బ్యాంక్ కొత్త చైర్మన్ నియామక ప్రక్రియను త్వరలో ప్రారంభించనుంది.
Also Read : స్టాక్ మార్కెట్ పరుగులు.. ఆల్ టైమ్ హైలో సూచీలు
గడువును మార్చి 15 వరకు పొడిగించిన RBI
Paytm పేమెంట్ బ్యాంక్‌లో డిపాజిట్లు, ఇతర లావాదేవీల గడువును RBI మార్చి 15 వరకు పొడిగించింది. ఫిబ్రవరి 16న శుక్రవారం ఆర్‌బీఐ ఈ మేరకు సర్క్యులర్ జారీ చేసింది. గత కొన్ని రోజులుగా, సెంట్రల్ బ్యాంక్ కూడా ప్రజల నుండి అనేక ప్రశ్నలను అందుకుంది. దాని ఆధారంగా, RBI FAQ (ప్రశ్న-సమాధానం) కూడా జారీ చేసింది.
అంతకుముందు, జనవరి 31న జారీ చేసిన సర్క్యులర్‌లో, ఫిబ్రవరి 29 తర్వాత, Paytm పేమెంట్ బ్యాంక్ ఖాతాలో డబ్బు జమ చేయడం కుదరదని RBI తెలిపింది. ఈ బ్యాంక్ ద్వారా వాలెట్, ప్రీపెయిడ్ సేవలు, ఫాస్టాగ్, ఇతర సేవలలో డబ్బు జమ చేయడం నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు వచ్చిన ప్రకటన పేటీఎం వాలెట్ వినియోగదారులకు మేలు చేసేదిగానే చెప్పాలి. ఇప్పుడు పేటీఎం స్వతంత్రంగా వేరే బ్యాంకులతో కలిసి పనిచేసే వెసులుబాటు లభిస్తుంది.