Payal Rajput: ఆ స్టార్ హీరోతో తగ్గేదేలే అంటున్న పాయల్ రాజ్‌పుత్.!

'మంగళవారం' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నేషనల్ స్టార్ అల్లు అర్జున్‌ సందడి చేశారు. ఆర్‌. ఎక్స్ ఫేమ్ హీరోయిన్ పాయల్ తో కలిసి పుష్ప మూవీలోని తగ్గేదేలే అనే డైలాగ్ యాక్షన్‌ చేస్తూ పిక్స్ దిగారు. దీంతో, ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయి హల్ చల్ చేస్తున్నాయి.

New Update
Payal Rajput: ఆ స్టార్ హీరోతో తగ్గేదేలే అంటున్న పాయల్ రాజ్‌పుత్.!

Payal Rajput : ఆర్ ఎక్స్ ఫేమ్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ , నందితా శ్వేత, దివ్యా పిళ్లై తదితరులు నటించిన చిత్రం 'మంగళవారం'. హైదరాబాదులోని జేఆర్ సీ కన్వెన్షన్స్ వేదికగా  ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ ను (Mangalavaram Movie Pre Release) వైభవంగా నిర్వహించారు. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ కార్యక్రమం సందర్భంగా నేషనల్ స్టార్ హీరో అల్లు అర్జున్  సందడి చేశారు. ప్రపంచ వ్యాప్తంగా సెన్సేషన్ అయిన పుష్ప మూవీలోని తగ్గేదేలే అనే ఫేమస్ డైలాగ్  యాక్షన్‌ ను హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ తో కలిసి చేస్తూ పిక్స్ దిగారు. అల్లు అర్జున్, పాయల్ రాజ్ పుత్ కలిసి దిగిన ఫొటోలను ఆమె తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీంతో, ఈ పిక్స్ కాస్తా వైరల్ గా మారాయి.

publive-image

'మంగళవారం' ఈ వెంట్ సందర్భంగానే అల్లు అర్జున్ తన పుష్ప 2 మూవీ అప్ డేట్స్ ను చెప్పుకొచ్చారు.  'పుష్ప 2' (Pushpa 2) లోని జాతర ఎపిసోడ్ ను షూట్ చేస్తున్నామని తెలిపారు. ఈ సినిమా వచ్చే ఆగస్టు 15న విడుదలవుతుందని వెల్లడించారు. 'పుష్ప 2'' అస్సలు తగ్గేదే లే. 'మిగతా విషయాలను వేరే ఈవెంటులో మాట్లాడుకుందామని అంటూ కామెంట్స్ చేశారు.

publive-image

'మంగళవారం' చిత్రం నవంబరు 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ముద్రా మీడియా వర్క్స్, ఏ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్లపై రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో అజ్మల్ అమీర్, రవీంద్ర విజయ్, కృష్ణ చైతన్య, అజయ్ ఘోష్, శ్రవణ్ రెడ్డి, సిరితేజ్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించారు.

Also Read: బంగారంలా మెరిసిపోతోన్న కీర్తి సురేశ్.. లేటెస్ట్ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే.!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు