Pawan Kalyan : పవన్ కు వదిన సురేఖ ఇచ్చిన పెన్ ఖరీదు అన్ని లక్షలా?

ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన జ‌న‌సేన అధినేత పవన్‌ కళ్యాణ్‌కు త‌న వ‌దిన సురేఖ అత్యంత ఖరీదైన మోంట్‌బ్లాంక్‌ పెన్నును బహుమతిగా ఇచ్చిన విష‌యం తెలిసిందే.ఈ పెన్ అసలు ధర తెలిసి నెటిజన్స్ షాక్ అవుతున్నారు. దీని అసలు ధర రూ.3.50 ల‌క్ష‌లు ఉన్న‌ట్లు తెలిసింది.

Pawan Kalyan : పవన్ కు వదిన సురేఖ ఇచ్చిన పెన్ ఖరీదు అన్ని లక్షలా?
New Update

Pawan Kalyan's Pen Cost : జనసేన (Janasena) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎలక్షన్స్ (AP Assembly Elections) లో సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయాన్ని పవన్ అభిమానులతో పాటూ మెగా ఫ్యామిలీ అంతా సెలెబ్రేట్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే పవన్ కి తన వదినమ్మ సురేఖ అత్యంత ఖరీదైన మోంట్‌బ్లాంక్‌ పెన్నును బహుమతిగా ఇచ్చింది.

అందుకు సంబంధించిన వీడియోను కూడా చిరంజీవి ఎక్స్ వేదిక‌గా పంచుకున్నాడు. అయితే ప‌వ‌న్‌కు మోంట్‌బ్లాంక్ పెన్ బహుమతిగా ఇచ్చిన అనంత‌రం ఈ పెన్ ధ‌ర ఎంత ఉంటుంది అని నెటిజ‌న్లు వెత‌క‌డం మొద‌లుపెట్టారు. ఎట్టకేలకు ఆ పెన్ అసలు ధర తెలిసి నెటిజన్స్ షాక్ అవుతున్నారు.

Also Read : దర్శన్ అరెస్ట్ పై స్పందించిన కన్నడ స్టార్ సుదీప్.. శిక్ష పడాలంటూ కామెంట్స్!

అన్ని లక్షలా?

పవన్ కళ్యాణ్ కు తన వదిన సురేఖ ఇచ్చిన మోంట్‌బ్లాంక్‌ పెన్ అసలు ధర రూ.3.50 ల‌క్ష‌లు ఉన్న‌ట్లు తెలిసింది. దీంతో ఈ విషయం తెలిసి అటు ఫ్యాన్స్ తో పాటూ ఇటు నెటిజన్స్ సైతం అవాక్కవుతున్నారు. పవన్ రేంజ్ కి ఆమాత్రం కాస్ట్లీ పెన్ ఉండాల్సిందే అంటూ కొందరు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఎన్నికలో అద్భుత విజయం సాధించిన పవన్ కళ్యాణ్ కు సీఎం చంద్రబాబు (CM Chandrababu) డిప్యూటీ సీఎం పదవితో పాటూ ఇంకా పంచాయతీ రాజ్, నీటి సరఫరా,పర్యావరణం, ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ.. ఇలా ఐదు పదవులు అప్పజెప్పారు.

publive-image

#janasena #pen-cost #surekha #pawan-kalyan
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe