AP : నేడే వారాహి విజయభేరి మోగించనున్న పవన్!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు పిఠాపురం నుంచి ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. నాలుగు రోజులు పిఠాపురంలోనే బస చేయనున్నారు. పురోహుతిక అమ్మవారిని దర్శించుకుని శక్తిపీఠంలో వారాహికి ప్రత్యేక పూజలు చేయనున్నారు.

New Update
Pawan Kalyan: హాలో ఏపీ.. బైబై వైసీపీ .. పవన్ వీడియో వైరల్..!

Janasena : జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నేడు పిఠాపురం నుంచి ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో భాగంగా నాలుగు రోజులు పిఠాపురం(Pithapuram) లోనే బస చేయనున్నారు. మొదటగా పురోహుతిక అమ్మవారిని దర్శించుకుని శక్తిపీఠంలో వారాహి(Varahi) కి ప్రత్యేక పూజలు చేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

వారాహికి ప్రత్యేక పూజలు..
ఈ మేరకు బేగంపేట విమానాశ్రయం(Begumpet Airport) నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి గొల్లప్రోలు లో ఏర్పాటుచేసిన హెలిపాడ్ వద్దకు చేరుకోనున్నారు. అక్కడి నుండి రోడ్డు మార్గంలో పాదగయ క్షేత్రానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుంటారు. అక్కడే వారాహికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అక్కడినుంచి దత్త పీఠానికి వెళ్లి శ్రీపాద శ్రీ వల్లభనే దర్శించుకోనున్నారు.

ఇది కూడా చదవండి : Crime : మగబిడ్డను కనలేదని.. భార్య, ముగ్గురు కూతుళ్ల గొంతు కోసి చంపిన వ్యక్తి!

వర్మ నివాసంలో మంతనాలు..
అలాగే రోడ్డు మార్గంలో దొంతమూరు లో టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ(SVSN Varma) నివాసానికి వెళ్ళనున్నారు. పిఠాపురం రాజకీయ పరిణామాలపై వర్మతో భేటీ కానున్నారు. అనంతరం పిఠాపురంలో ఓ ప్రైవేటు హోటల్ బస చేసే ప్రాంతానికి చేరుకోని, సాయంత్రం 5 గంటలకు గొల్లప్రోలు మండలం చేబ్రోలు రామాలయం సెంటర్ లో బహిరంగ సభలో పాల్గొంటారు. ఇక్కడే వారాహి విజయబేరి నీ మోగించనున్నారు. వారాహి పైనుంచి బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఇక పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నానని పవన్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా మొదటిసారి పవన్ పిఠాపురం రానున్నారు.

Advertisment
తాజా కథనాలు