Viswambhara : చిరంజీవి సినిమా.. ఆ క్యారెక్టర్ లో పవన్‌ కల్యాణ్‌!

చిరంజీవి కొత్త చిత్రం విశ్వంభర శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్రలో పవన్‌ కల్యాణ్‌ నటిస్తున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. దీనికి పవన్‌ కూడా అంగీకారం తెలిపినట్లు మూవీ మేకర్స్‌ వెల్లడించారు.

New Update
Viswambhara : చిరంజీవి సినిమా.. ఆ క్యారెక్టర్ లో పవన్‌ కల్యాణ్‌!

Chiranjeevi - Pawan Kalyan : మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)  ప్రస్తుతం తన 156 సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. యంగ్‌ డైరెక్టర్‌ వశిష్ట(Vasishta)  చెప్పిన కథ నచ్చడంతో ఆయన '' విశ్వంభర ''(Viswambhara)  సినిమాని పట్టాలెక్కిస్తున్నారు. ఇప్పటికే సినిమా కథ గురించి, ఇందులోని ముఖ్య పాత్రల గురించి డైరెక్టర్ చిరంజీవితో చెప్పడం ఆయన కొన్ని మార్పులు, చేర్పులు చెప్పడంతో చిత్రీకరణ మొదలు పెట్టేశారు చిత్ర బృందం వారు.

ఈ క్రమంలో ఈ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్రలో పవన్‌ కల్యాణ్‌(Pawan Kalyan) నటిస్తున్నట్లు సమాచారం. సినిమాలో ఈ క్యారెక్టర్‌ కనిపించేది కేవలం 15 నుంచి 20 నిమిషాల సమయం మాత్రమే. అయినప్పటికీ కూడా వారు పవన్‌ ని ఈ పాత్ర చేయడానికి అడగగా ఆయన వెంటనే ఓకే చెప్పేశారని వినికిడి.

దీంతో చిత్ర బృందం ఆనందానికి హద్దులే లేకుండా పోయాయి. ఈ విషయం గురించి చిత్ర బృందం సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకుంది. ఇది తెలిసిన అటు మెగాస్టార్‌ అభిమానులు, ఇటు పవన్‌ అభిమానులు వీరిద్దరి కాంబో కోసం వేయిట్ చేస్తున్నారు. ముందుగా ఈ పాత్ర కోసం ఓ తమిళ స్టార్‌ నటుడ్ని అనుకున్నారంట..అయితే డైరెక్టర్‌ వంశీ ఈ పాత్రకు పవన్‌ ని అనుకుంటున్నట్లు చిరంజీవితో చెప్పారంట.

దాంతో ఆయన కూడా ఈ పాత్రకు పవన్‌ కల్యాణ్‌ కరెక్ట్‌ సూట్‌ అవుతారని భావించి డైరెక్టర్‌కి చెప్పారంట. దాంతో ఆయన పవన్‌ కి ఫోన్‌ చేసి ఈ విషయం గురించి వివరించడంతో ఆయన కథ కూడా వినకుండ చిరంజీవి సినిమాలో చిన్న క్యారెక్టర్‌ ఇచ్చిన సరే చేస్తానని ఆయన చెప్పారంట..అలా ఈ సినిమాలో పవన్‌ కూడా ఓ పాత్రను పోషిస్తున్నారు.

అయితే ప్రస్తుతం పవన్‌ ఎన్నికల(Elections)  హడావిడిలో ఫుల్‌ బిజీగా ఉన్నారు. దీంతో ఇప్పట్లో ఆయన షూట్‌ కి రావడం కుదరదు. దాంతో ఎన్నికల తరువాతే ఆయన క్యారెక్టర్‌ కి సంబంధించిన షూట్‌ ఉంటుందని తెలుస్తుంది. అప్పటి వరకు చిరంజీవి మీద సన్నివేశాలను చిత్రీకరించి పవన్‌ వచ్చిన తరువాత ఆయన సన్నివేశాలను చిత్రీకరిస్తారని తెలుస్తోంది.

Also read: ఎమ్మెల్సీది యాక్సిడెంట్‌ కాదా..? చంపేశారంటున్న కుమారుడు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు