Pawan Kalyan: రాష్ట్ర ప్రజలకు కృతజ్ఙతలు తెలిపిన జన సేనాని!

ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఘన విజయాన్ని సాధించి పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఏపీ ప్రజలకు కృతజ్ఙతలు తెలుపుతూ ఓ లేఖను విడుదల చేశారు.పూర్తి వివరాలు ఈ కథనంలో..

New Update
Pawan Kalyan: రాష్ట్ర ప్రజలకు కృతజ్ఙతలు తెలిపిన జన సేనాని!

Pawan Kalyan: ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఘన విజయాన్ని సాధించి పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఏపీ ప్రజలకు కృతజ్ఙతలు తెలుపుతూ ఓ లేఖను విడుదల చేశారు. ఆ లేఖలో '' రాజకీయ, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రైతాంగం, కార్మిక లోకం, పారిశ్రామిక వేత్తలు, విద్యావంతులు, మేధావులు, మహిళలు, యువత, సామాజికవేత్తలు..ఇలా ప్రతీ వర్గం వారు కూడా ఈ విజయం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే తెలుగు చలనచిత్ర పరిశ్రమ నుంచి ప్రముఖ కథానాయకులు, నటులు, నిర్మాతలు, దర్శకులు, సాంకేతిక నిపుణులు హర్షాన్ని తెలియజేస్తూ శుభాకాంక్షలు అందించారు. ఇటు తెలుగుతో పాటు అటు కన్నడ, తమిళ, హిందీ చిత్ర పరిశ్రమలకు చెందిన శ్రేయోభిలాషులు తమ ఆనందాన్ని వెల్లిబుచ్చారు.

publive-image

ఏపీలో కూటమి సాధించిన విజయాన్ని స్వాగతిస్తూ శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వకంగా కృతజ్ఙతలు తెలియజేస్తున్నాను. ఈ విజయం మా అందరి పై బాధ్యతను మరింత పెంచింది. రాష్ట్ర అభివృద్ది కోసం ప్రజల సంక్షేమం కోసం చిత్త శుద్దితో ముందడగు వేస్తామంటూ పవన్‌ వివరించారు.

Also read: కొత్త ఎంపీల్లో ఇంతమంది ఇంటర్‌ లోపే చదివారా?

#janasena #Pawan Kalyan #politics
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు