Pawan Kalyan: సెలబ్రేషన్స్ మామూలుగా లేవుగా...డిప్యూటీ సీఎం నా మజాకానా...

పాత సినిమాల రీరిలీజ్ ట్రెండ్ నడుస్తోంది ప్రస్తుతం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నటించిన సూపర్ హిట్ సినిమా తమ్మడు రీ రిలీజ్ అయింది. దీంతో పవన్ అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు.

New Update
Pawan Kalyan: సెలబ్రేషన్స్ మామూలుగా లేవుగా...డిప్యూటీ సీఎం నా మజాకానా...

Tammudu Re Release:ఈరోజు తమ్ముడు సినిమా రీరిలీజ్ అయింది. ఈ సినిమా వచ్చి 25 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా మరోసారి తమ్ముడిని థియేటర్లలో రిలీజ్ అయింది. ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి గా పవన్ కల్యాణ్ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ సినిమాను రీరిలీజ్ చేశారు. తమ్ముడు సినిమా అప్పట్లోనే పెద్ద హిట్ అయింది. అదో సూపర్ డూపర్ హిట్. ఇప్పుడు రీరిలీజ్‌లో కూడా మరోసారి దాన్ని సూపర్ హిట్ చేశారు పవన్ అభిమానులు. థియేటర్ల దగ్గర పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. దీని తాలూకా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

హైదరాబాద్‌లో సుదర్శన్ థియేటర్ దగ్గర పవన్ కల్యాణ్ పెద్ద కటౌట్‌ను ఏర్పాటు చేశారు అభిమానులు. ఆయన రాజకీయ నాయకుడులా ఉన్న పోస్టర్‌ను పెట్టారు. దాని చుట్టూ భారీఆ ఫైర్ వర్క్స్ పెట్టి హంగామా చేశారు. కట్ అవుట్ పై పూలు భారీగా ఎగరవేసి, థియేటర్ బయట డాన్సులు వేస్తూ పెద్దగా సెలబ్రేట్ చేసుకున్నారు.

Also Read:Hyderabad: అవినీతికి అడ్డాగా ఆ పోలీస్ స్టేషన్.. ఒకే సారి 12 మంది సీఐలు, నలుగురు ఎస్ఐలు ఔట్!

Advertisment
తాజా కథనాలు