Pawan Kalyan : మొదటి రోజే 10 గంటల పాటు సమీక్ష.. అధికారుల టార్గెట్ మూడు నెలలే!

ఏపీ ఉపముఖ్యమంత్రిగా పిఠాపురం ఎమ్మెల్యే పవన్‌ కల్యాణ్‌ బుధవారం బాధ్యతలు స్వీకరించారు.ఆ తర్వాత విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో దాదాపు 10 గంటల పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీశాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.ఆయా శాఖల పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు.

Pawan Kalyan : మొదటి రోజే 10 గంటల పాటు సమీక్ష.. అధికారుల టార్గెట్ మూడు నెలలే!
New Update

Pawan Kalyan Review For 10 Hours In Camp Office : ఏపీ ఉపముఖ్యమంత్రిగా పిఠాపురం (Pithapuram) ఎమ్మెల్యే పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) బుధవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మొదటి రోజే పవన్‌ సుదీర్ఘ సమీక్షను నిర్వహించారు. ఆ తర్వాత విజయవాడ (Vijayawada) లోని క్యాంపు కార్యాలయంలో దాదాపు 10 గంటల పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీశాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఆయా శాఖల పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు.

రాష్ట్రంలోని గ్రామాల్లోని రోడ్ల నిర్మాణంపై దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గ్రామాల్లో మౌలిక వసతులు, మంచినీటి కొరత రాకుండా చూడాలని చెప్పారు. తాను చెప్పిన అంశాలపై వెంటనే అధికారులు యాక్షన్ ప్లాన్ రెడీ చేయాలని తెలిపారు. మూడు నెలల్లో ఈ సమస్యల పరిష్కారం జరగాలని టార్గెట్ పెట్టారు.

మూడు నెలల తరువాత మరోసారి సమీక్ష నిర్వహిస్తానని పవన్‌ చెప్పారు. ప్రజాసమస్యల పరిష్కారంపై నిర్లక్ష్యం వద్దని పవన్‌ అధికారులకు చెప్పారు. ఆ తర్వాత ఉపముఖ్యమంత్రి తో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ భేటీ అయ్యారు.మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే జాతీయ ఉపాధి హామీ పథకాన్ని (National Employment Guarantee Scheme) వ్యవసాయానికి అనుసంధానం చేస్తూ పవన్ కల్యాణ్ తొలి సంతకం చేశారు. గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణం దస్త్రంపై రెండో సంతకం పెట్టిన విషయం తెలిసిందే.

Also read: షూటింగ్‌ లో గాయపడిన బాలీవుడ్‌ ముద్దుగుమ్మ!

#andhra-pradesh #deputy-cm #janasena #pawan-kalyan #pithapuram
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe