AP JOBS: పిఠాపురం నియోజక వర్గంలో నిర్వహించిన జాబ్ మేళాలో 729 నిరుద్యోగులకు నియామక ఉత్తర్వులు ఇచ్చినట్లు కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు సుమారు 24 కంపెనీల ఆద్వర్యంలో జాబ్ మేళా నిర్వహించి 2500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పనకు శ్రీకారం చుట్టామని చెప్పారు.
జాబ్ మేళాకు 2,790 మంది నిరుద్యోగులు హాజరు..
ఈ మేరకు పిఠాపురం పట్టణం ఎస్ఎఫ్ఐ స్కూల్లో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాలో 729 మందికి నియామక ఉత్తర్వులు అందజేసినట్లు వికాస పి.డి లచ్చారావు తెలిపారు. ఈ జాబ్ మేళాకు 2,790 మంది నిరుద్యోగులు హాజరుకాగా729 మంది నిరుద్యోగులకు వివిధ కంపెనీల ద్వారా నియామక ఉత్తర్వులు అందజేశారు. ఈ మెగా జాబ్ మేళాను కాకినాడ ఎంపీ తంగిళ్ళ ఉదయ శ్రీనివాస్ ప్రారంభించగా 40 కంపెనీల నుంచి వచ్చిన ప్రతినిధులు నిరుద్యోగుల నుండి ఇంటర్వ్యూలు సేకరించి రూ.15 వేల నుంచి అత్యధికంగా రూ.40 వేల వరకు జీతం పొందే విధంగా ఉద్యోగాలు ఇచ్చారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి మర్రెడ్డి శ్రీనివాస్, కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, మాజీ ఎమ్మెల్యే ఎస్ విఎస్ఎన్ వర్మ, మున్సిపల్ కమిషనర్ నామ కనకారావు, తాసిల్దార్ ఎస్ ఎల్ ఎన్ కుమారి, జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.