/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/pawannn.png)
గత(2019) ఎన్నికల్లో పోటి చేసిన రెండు చోట్లా ఓడిపోయిన జనసేన అధినేత పవన్‌కల్యాణ్(Pawan Kalyan) ఈసారి మాత్రం ఫుల్ ఫోకస్డ్‌గా అడుగులు వేస్తున్నారు. ఏ నియోజకవర్గం నుంచి పోటి చేయాలన్నదానిపై సుదీర్ఘంగా ఆలోచిస్తున్నారు. అక్కడ ఇక్కడ అని రకరకాల నియోజకవర్గాల నుంచి పోటి చేస్తారని ప్రచారం జరుగుతున్నా ఇప్పటివరకు అయితే క్లారిటీ లేదనే చెప్పాలి. అయితే తాజాగా ఆయన కాకినాడ(Kakinada) నుంచి పోటి చేయబోతున్నారంటూ ప్రచారం మొదలైంది. మూడు రోజులు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నియోజకవర్గ ఇన్చార్జిలతో పవన్ విడివిడిగా సమావేశమయ్యారు.
ఇక్కడ నుంచే పోటినా?
కాకినాడ జిల్లాలో ముగిసిన జనసేన అదినేత పవన్ కళ్యాణ్ మూడు రోజుల పర్యటన ముగిసింది. పర్యటన ముగించుకుని తిరిగి రాజమండ్రి మధురపూడి విమానాశ్రయానికి స్టార్ట్ అయ్యి వెళ్లారు పవన్. మూడు రోజులు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నియోజకవర్గ ఇన్చార్జిలతో సమావేశమైన జనసేన అధినేత.. టీడీపీ-జనసేన పోత్తులతో ఏ విధంగా ముందుకు వెళ్లాలి అనే దానిపై పలు సూచనలు చేసినట్టు సమాచారం. మీడియాకు ఎలాంటి లీకులు లేకుండా ఇన్చార్జిలు, తోటి క్రింది స్థాయి కార్యకర్తలతో పవన్ మీటింగ్ పెట్టడం చర్చనీయాంశమవుతోంది. ముఖ్యంగా కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గాలపై పవన్ దృష్టిసారించడంపై ఓటర్లు వివిధ రకాలుగా చర్చించుకుంటున్నారు. కాకినాడలో ఉన్నా 48 డివిజన్ల జనసేన క్యాడర్ తో సమావేశం అయ్యారు పవన్. మీకు ఏ అవసరం వచ్చినా నేను అందుబాటులో ఉంటానని పవన్ భరోసా ఇచ్చినట్టు తెలుస్తోంది. పవన్ మాటలతో సంతృప్తి వ్యక్తం చేశారు నాయకులు. కింది స్థాయి జనసేన కార్యకర్తలు కూడా సంతృప్తిగా ఉన్నట్టు సమాచారం.
కాకినాడ నుంచి ఫిక్సా?
కాకినాడ సిటీ నుంచి పోటీ చేయాలని జనసేనానినిపై కార్యకర్తల తీవ్ర ఒత్తిడి చేసినట్లు సమాచారం. పొత్తులో భాగంగా కాకినాడ పార్లమెంట్ స్థానంతో పాటు, పార్లమెంట్ పరిధిలో 7స్థానాలలో మూడు స్థానాలు ఆశిస్తున్నట్టుగా సమాచారం. గతంలో వారాహి యాత్రలో కూడా కాకినాడ రాజకీయ పరిణామాలపై స్థానిక అదికార పార్టీ నేతలపై సంచలన కామెంట్స్ చేశారు పవన్. గోదావరి జిల్లాలో వైసిపి కి ఒక్క సీటు కూడా రాదంటూ కామెంట్స్ చేశారు. ఇక గత 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన రెండు అసెంబ్లీ స్థానాల నుంచి పవన్ ఓడిపోయారు. విశాఖపట్నం జిల్లాలోని గాజువాక నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్‌ఆర్‌సీపీ) అభ్యర్థి టి.నాగిరెడ్డిపై 16 వేల ఓట్ల తేడాతో పవన్ ఓడిపోయారు. అటు పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలో వైఎస్‌ఆర్‌సీపీకి చెందిన గ్రాంధి శ్రీనివాస్ 8 వేలకు పైగా ఓట్లతో విజయం సాధించడంతో పవన్ ఓటమిని చవిచూశారు.
Also Read: అవార్డులను తిరిగి ఇచ్చేందుకు పీఎంఓకు వినేశ్.. అడ్డుకున్న పోలీసులు.. తర్వాత ఏం జరిగిందంటే?
WATCH: