Pawan Kalyan : తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. పలు జిల్లాల్లో వరదలు ముంచెత్తడంతో జనజీవనం స్తంభించిపోయింది. భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరగడంతో పాటు వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఈ క్రమంలో వరద బాధితులను ఆదుకునేందుకు సినీ ప్రముఖులు ముందుకొస్తున్నారు. తాజాగా సినీ నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం వరద బాధితుల కోసం భారీ విరాళాన్ని ప్రకటించారు.
Also Read : ‘మిస్టర్ బచ్చన్’ ప్లాప్.. హరీష్ శంకర్ చేసిన పనికి నెటిజన్స్ ప్రశంసలు
400 గ్రామ పంచాయతీలు వరద ముంపు బారిన పడ్డాయి.. ఒక్కో పంచాయతీకి రూ. లక్ష చొప్పున నేరుగా పంచాయతీ ఖాతాకు విరాళం పంపిస్తాను అని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. రూ.4 కోట్లు మొత్తం ముంపు గ్రామ పంచాయతీలకు పంపించాలని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. కోటి విరాళం అందించనున్నానని అధికారికంగా తెలిపారు.