AP Politics : దూకుడు పెంచిన టీడీపీ, జనసేన.. మరోసారి సమావేశం కానున్న పవన్, చంద్రబాబు..

ఏపీలో అభ్యర్థుల టికెట్లు ఖరారు చేసేందుకు టీడీపీ, జనసేన కసరత్తులు చేస్తున్నాయి. ఏ పార్టీకి ఎన్ని సీట్లు, అభ్యర్థులెవరు అనేదానిపై చర్చించిన చంద్రబాబు, పవన్‌లు ఈ నెల 8న మరోసారి భేటీ కానున్నారు. ఇందులో ఉమ్మడి మేనిఫెస్టో, ప్రచార వ్యూహాలపై చర్చించనున్నట్లు తెలుస్తుంది.

New Update
AP Politics : దూకుడు పెంచిన టీడీపీ, జనసేన.. మరోసారి సమావేశం కానున్న పవన్, చంద్రబాబు..

TDP-Janasena : లోక్‌సభ(Lok Sabha), అసెంబ్లీ ఎన్నికలు(Assembly Elections) దగ్గర పడుతుండటంతో టీడీపీ, జనసేన(TDP-Janasena) పార్టీలు దూకుడు పెంచుతున్నాయి. అభ్యర్థులను ఎంపిక చేసి సీట్లు ఖరారు చేసేందుకు కసరత్తులు చేస్తున్నాయి. అలాగే బీజేపీ(BJP) తో పొత్తు అంశంపై కూడా పవన్ కల్యాణ్, చంద్రబాబు నాయుడు సుదీర్ఘంగా చర్చించారు. ఏ పార్టీకి ఎన్నిసీట్లు, ఎక్కవ ఎవరు పోటీ చేయాలి.. అభ్యర్థులు ఎవరు అనే అంశాలపై మాట్లాడారు.

8న మరోసారి భేటీ

ఇప్పటికే పలుసార్లు భేటీ అయిన చంద్రబాబు(Chandrababu), పవన్(Pawan Kalyan).. మరోసారి ఈ నెల 8న సమావేశం కానున్నారు. ఇందులో ఉమ్మడి మేనిఫెస్టో, ప్రచార వ్యూహాలపై చర్చించనున్నట్లు తెలుస్తుంది. అలాగే వీళ్లిద్దరు కలిసే పాల్గొనే సభలపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరోవైపు రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థిపై కూడా చర్చ జరపనున్నట్లు సమాచారం. ఈ సమావేశం అనంతరం పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లనన్నారు.

Also Read : ప్రారంభం అయిన ఏపీ అసెంబ్లీ సమావేశాలు..

14న ఫస్ట్‌ లిస్ట్‌..!

ఇక ఫిబ్రవరి 14న టీడీపీ మొదటి లిస్ట్‌ ప్రకటించే అవకాశాలు కనపిస్తున్నాయి. ఇప్పటికే ప్రజాకోర్ట్‌(Praja Court) పేరుతో టీడీపీ ఛార్జిషీట్‌ను రూపొందించింది. దీన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈరోజు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో 10 అంశాలపై చర్చించేందుకు టీడీపీ పట్టుబట్టనున్నట్లు తెలుస్తోంది.

ఎల్లుండి బడ్జెట్‌

ఇదిలా ఉండగా ఏపీలో ఈరోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు(Assembly Meetings) జరగనున్నాయి. మొదట గవర్నర్ ప్రసంగించిన తర్వాత ఇరు సభలూ వాయిదా పడనున్నాయి. సభల వాయిదా అనంతరం బీఎస్సీ సమావేశం జరగనుంది. ఇందులో ఎన్ని రోజులు సభలు నిర్వహించాలని అనే దానిపై చర్చించనున్నారు. ఇక రేపు గవర్నర్ ప్రసంగం మీద ధన్యవాద తీర్మానం చేస్తారు. ఎల్లుండి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

Also Read: కొలిక్కి వస్తున్న విశాఖ ఎమ్మార్వో రమణయ్య హత్య కేసు

Advertisment
తాజా కథనాలు