జైల్లో పవిత్రాగౌడ్ మేకప్..పోలీసుపై యాక్షన్ రేణుకాస్వామి హత్య కేసులో అరెస్ట్ అయిన కన్నడ నటుడు దర్శన్, పవిత్రాగౌడ్లో ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్నారు. అయితే అక్కడ వారి చేష్టలు అందరినీ నివ్వెరపరుస్తున్నాయి. కస్టడీలో ఉన్నప్పుడు కూడా పవిత్రాగౌడ్ మేకప్ వేసుకోవడం వివాదాలకు దారి తీస్తోంది. By Manogna alamuru 28 Jun 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Darshan, Pavitra Goud: హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్, పవిత్రా గౌడ్ అరెస్ట్ అయ్యారు. వారి మీద నేరం నిరూపితమయింది. ఈ కేసులో వారు చేసిన దారుణాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. శిక్ష పడడం ఖాయంగా కనిపిస్తోంది అయితే దీనికి దర్శన్ గానీ, పవిత్ర గానీ ఎక్కడా పశ్చాత్తాప పడుతున్నట్టు కనిపించడం లేదు తాము తప్పు చేశామని ఇద్దరు అనుకుంటున్నట్టు కనిపించడం లేదు. అరెస్ట్ చేసినప్పుడు, కస్టడీలో ఉన్న సమయంలో వారి ప్రవర్తనే దీనికి ఉదాహరణగా కనిపిస్తోంది. పోలీస్ కస్టడీలో పవిత్రాగౌడ్ మేకప్ వేసుకుని, లిప్‌స్టిక్ రాసుకుని కనిపించింది. రేణుకాస్వామి హత్య కేసులో విచారణ నిమిత్తం జూన్ 15న పవిత్రా గౌడను పోలీసులు బెంగళూరులోని ఆమె నివాసానికి తీసుకెళ్లారు. ఆ సమయంలో ఆమె ముఖానికి మేకప్ వేసుకుని, లిప్‌స్టిక్ రాసుకుంది. లోపలికి మామూలుగా వెళ్లిన ఆమె.. ఆ తర్వాత పోలీసు సిబ్బందితో కలిసి ఇంటినుంచి బయటకువస్తుండగా మేకప్‌తో నవ్వుతూ కన్పించింది. దీని తాలూకా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. హత్య చేయడమే కాకుండా, అరెస్ట్ అయితే నవ్వుతూ కనిపించడమేమిటని నెటిజన్లు మండిపడుతున్నారు. దీనిపై పోలీసు అధికారులు చర్యలు చేపట్టారు. మహిళా ఎస్సైకి నోటీసులు జారీ చేశారు. పవిత్రా గౌడతో పాటు వెళ్లిన మహిళా ఎస్సై నటి ప్రవర్తనను గమనించి అడ్డుకోవాల్సింది. నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గానూ ఆ పోలీసు అధికారిణికి నోటీసులు జారీ చేసి వివరణ అడిగాం అని డీసీపీ తెలిపారు. Also Read:Ambani’s Marriage: అనంత్, రాధికాల పెళ్ళి శుభలేఖ ధర తెలిస్తే నోరు వెళ్ళబెట్టాల్సిందే.. #murder #darshan #kannada #pavitra-goud #renukaswami మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి