Patnam Mahender Reddy: మంత్రిగా పట్నం మహేందర్ రెడ్డి ప్రమాణస్వీకారం..రాజ్ భవన్ కెళ్లిన సీఎం కేసీఆర్!

పట్నం మహేందర్ రెడ్డి మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. రాజ్ భవన్ లో ఆయన చేత గవర్నర్ తమిళి సై తెలుగులోనే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

New Update
Patnam Mahender Reddy: మంత్రిగా పట్నం మహేందర్ రెడ్డి ప్రమాణస్వీకారం..రాజ్ భవన్ కెళ్లిన సీఎం కేసీఆర్!

Patnam Mahender Reddy:  బీఆర్ఎస్ నేత పట్నం మహేందర్ రెడ్డి మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. రాజ్ భవన్ లో గవర్నర్ తమిళి సై తెలుగులోనే ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

ఆయనకు ఏ పోర్ట్ ఫోలియో..!

కేసీఆర్ తెలంగాణలో ఎన్నికలకు మూడు నెలల ముందు పట్నం మహేందర్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక ఆయనకు ఏ శాఖ కేటాయిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకు ఈ విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు.ఈటల రాజేందర్ ను మంత్రివర్గం నుంచి తప్పించినప్పట్నుంచి ఆ స్థానాన్ని సీఎం కేసీఆర్ భర్తీ చేయలేదు. దీంతో పట్నం మహేందర్ రెడ్డికి అవకాశం లభించింది. బీసీ వర్గానికి చెందిన ఈటల మంత్రిగా ఉన్న ఆ స్థానాన్ని రెడ్డి కులానికి చెందిన పట్నంతో ఎలా భర్తీ చేస్తారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

రోహిత్ రెడ్డికి టికెట్ ఇవ్వడంతోనే..!

2014 లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పట్నం మహేందర్ రెడ్డి తాండూర్ నుంచి పోటీ చేసి గెలిచారు. అప్పుడు ఆయనకు కేసీఆర్ మంత్రి వర్గంలో చోటుదక్కింది. రవాణా శాఖ మంత్రిగా ఆయన చేశారు. ఇక 2018 ఎన్నికల్లో మాత్రం అదే తాండూర్ నుంచి పోటీ చేసిన పట్నం కాంగ్రెస్ అభ్యర్థి పైలెట్ రోహిత్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. దీంతో మహేందర్ రెడ్డికి ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించారు.

రానున్న ఎన్నికల్లో తాండూర్ నుంచి మరోసారి టికెట్ ను పట్నం మహేందర్ రెడ్డి ఆశించారు. ఈక్రమంలో పైలెట్ రోహిత్ రెడ్డి ఇంకా మహేందర్ రెడ్డికి గత కొంత కాలంగా ఓపెన్ వారే నడుస్తోంది. చాలా సార్లు వీళ్లిద్దరు బాహాబాహీకి దిగారు. అధిష్టానం కూడా వాళ్ళను నిలువరించ లేకపోయింది. ఈ నేపథ్యంలోనే పైలెట్ రోహిత్ రెడ్డికి తాండూర్ టికెట్ ఇచ్చి.. పట్నం మహేందర్ రెడ్డికి మంత్రివర్గంలో తీసుకున్నారు. మహేందర్ రెడ్డికి భూగర్భ గనుల శాఖ, సమాచార శాఖను కేటాయించారు.

Advertisment
తాజా కథనాలు