Hyderabad : బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్.. కాంగ్రెస్ గూటికి పట్నం ఫ్యామిలీ!

బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. పట్నం ఫ్యామిలీ కేసీఆర్ కు గుడ్ బై చెప్పేసింది. కాంగ్రెస్‌ నుంచి చేవెళ్ల ఎంపీ టికెట్‌ సునీతారెడ్డి ఆశిస్తుండగా ఈ దంపతులు సీఎం రేవంత్‌రెడ్డితో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ఢీల్లీ లేదా హైదరాబాద్‌ వేదికగా పార్టీలో చేరే విషయంపె చర్చిస్తున్నట్లు తెలిపారు.

New Update
Hyderabad : బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్.. కాంగ్రెస్ గూటికి పట్నం ఫ్యామిలీ!

Patnam Mahender Reddy : బీఆర్ఎస్(BRS) పార్టీకీ వరుస షాక్ లు తగులుతున్నాయి. కేసీఆర్(KCR) గవర్నమెంట్ లో కొంతకాలం కీలకంగా పనిచేసిన నేతలంతా ఒక్కొక్కరుగా పార్టీని విడుతున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ మాజీ డిప్యూటీ మేయర్ బాబా(Baba Fasiuddin) ఫసీయుద్దీన్ రాజీనామా చేయగా.. తాగాజా పట్నం ఫ్యామిలీ బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేసింది.

రేవంత్‌రెడ్డితో భేటీ..
ఈ మేరకు మహేందర్‌రెడ్డి(Mahender Reddy) తో పాటు తమ అనుచరులంతా వారం రోజుల్లో కాంగ్రెస్‌లో చేరబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇందులోభాగంగానే మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఆయన సతీమణి, వికారాబాద్‌ జడ్పీ ఛైర్‌పర్సన్‌ సునీతారెడ్డి(Sunitha) గురువారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth Reddy) తో ఆయన నివాసంలో భేటీ అయ్యారు.

ఢీల్లీ లేదా హైదరాబాద్‌ వేదికగా..
ఈ సందర్భంగా సునీతారెడ్డి మాట్లాడుతూ.. ఢీల్లీ(Delhi) లేదా హైదరాబాద్‌(Hyderabad) వేదికగా పార్టీలో చేరాలా, జిల్లాలో బహిరంగ సభ నిర్వహించి చేరాలా అనే విషయమై చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దామోదర్‌ రాజనర్సింహ, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి కుమారుడు రినీష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి : Mumbai : ఫేస్‌బుక్‌ లైవ్‌లో మర్డర్.. కార్పోరేటర్ ను కాల్చి చంపిన ఉద్యమకారుడు

హ్యాండ్ ఇచ్చిన కేసీఆర్..
అయితే శాసనసభ ఎన్నికలకు ముందే మహేందర్‌రెడ్డి, సునీతారెడ్డిలు కాంగ్రెస్‌లో చేరతారని ప్రచారం జరిగినప్పటికీ ఇంతకాలం బీఆర్ఎస్ లోనే కొనసాగారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు టికెట్‌ ఆశించిన మహేందర్‌రెడ్కి కేసీఆర్ హ్యండ్ ఇచ్చి.. రోహిత్‌రెడ్డికి టికెట్‌ కేటాయించాడు. మహేందర్‌రెడ్డికి మంత్రి పదవి ఇచ్చింది. కానీ సునీతారెడ్డి కాంగ్రెస్‌ నుంచి చేవెళ్ల ఎంపీ టికెట్‌ ఆశిస్తున్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే అందుకే సీఎంని కలిసి ఉండొచ్చని తెలుస్తోంది.

ఎవరి ఇష్టం వారిదే..
మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, సునీతారెడ్డి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసిట్లు తాను మీడియాలో చూశానన్న కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి.. దీనిపై తనకు వారు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని చెప్పారు. రాజకీయాల్లో ఎవరి ఇష్టాలు వారికుంటాయని, చేవెళ్ల ఎంపీ టికెట్‌ ఇస్తామని కాంగ్రెస్‌ నేతలు హామీ ఇచ్చినట్టు తెలిసిందన్నారు. అందుకే సీఎంని కలిసి ఉండొచ్చని, తాను మాత్రం బీఆర్ఎస్ లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.

Also Read : అసెంబ్లీకి కేసీఆర్ రాకపై ఉత్కంఠ.. ఆటోల్లో బయలుదేరిన ఎమ్మెల్యేలు!!

Advertisment
తాజా కథనాలు