Aus vs Pak Test : ఒక బాల్, ఐదు రన్స్..కంగారూల కొత్త రికార్డ్

ఆస్ట్రేలియా, పాకిస్తాన్ దేశాల మధ్య బాక్సింగ్ డే టెస్ట్ జరిగింది. ఇందులో ఆస్ట్రేలియా విజయం సాధించింది. కంగారూలు ఇరగదీశారు. అందులో పాట్ కమిన్స్ తీసిన ఐదు పరుగులు మాత్రం హైలెట్ గా నిలిచాయి.

New Update
Aus vs Pak Test : ఒక బాల్, ఐదు రన్స్..కంగారూల కొత్త రికార్డ్

Australia v/s Pakistan : ఒక బాల్ కు ఐదు రన్స్ వచ్చాయి. అది ఫోర్ కాదు, నో బాల్ వేయలేదు. కానీ పరుగులు మాత్రం ఐదు వచ్చాయి. ఆస్ట్రేలియా(Australia) -పాకిస్తాన్(Pakistan) మధ్య జరిగిన బాక్సింగ్ డే టెస్ట్‌లో జరిగిందీ అద్బుతం. ఇప్పటివరకు ఒక బాల్‌కు నాలుగు రన్స్ రావడం క్రికెట్‌లో రికార్డ్. సచిన్-గౌతమ్ గంభీర్ కలిసి ఒక బాల్‌కు నాలుగు పరుగులు తీశారు. ఇప్పుడు వీళ్ళిద్దరి రికార్డ్‌ను తిరరాశారు పాట్ కమిన్స్-అలెక్స్ క్యారీలు. ఒక రన్ కు ఐదు పరుగులు తీసి వాహ్ అనిపించారు.

Also Read:చాట్ జీపీటీకి పోటీగా జియో భారత్ జీపీటీ

అదెలా జరిగిందంటే...బాక్సింగ్ డే టెస్ట్‌లో రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా పాకిస్తాన్‌కు 317పరుగుల లక్ష్యాన్ని ఇచ్చింది. ఈ రన్స్ కొట్టే నేపథ్యంలో పాట్ కమిన్, అలెక్స్ క్యారీలు క్రీజ్‌లో ఉన్నారు. అంతకు ముందు వాళ్ళు 187 పరుగుల దగ్గర సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. ఇందులో 52 పరుగులతో అలెక్స్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. పాట్ కమిన్స్, అలెక్స్‌లు క్రీజులో ఉన్నారు. కమిన్స్ బ్యాటింగ్ చేస్తున్నాడు, పాకిస్తాన్ బౌలర్ ఆమిర్ జమాల్ బౌలింగ్ చేస్తున్నాడు. జమాల్ వేసిన బంతికి కమిన్ షాట్ కొట్టాడు. దీంతో వారికి రెండు రన్స్ వయ్యాయి. దాన్ని బౌండరీకి వెళ్ళకుండా అడ్డుకోవడంలో పాకిస్తాన్ ఆటగాళ్ళు సక్సెస్ అయ్యారు కానీ అక్కడే అదే బాల్‌కు ఐదు రన్స్ రావడానికి మాత్రం కారణం అయ్యారు. ఫీల్డింగ్ లో ఉన్న ఆటగాళ్ళు బాల్‌ను వికెట్ల దగ్గరకు విసిరారు. అది కాస్తా ఓవర్ త్రో అయిపోయింది. వికెట్ల దగ్గర ఉన్న ప్లేయర్ బాల్‌ను పట్టుకోవడంలో విఫలం అవడంతో అది మరోవైపు వెళ్ళిపోయింది. అది మళ్ళీ బౌలర్ చేతికి వచ్చేసరికి కంగారూ బ్యాట్స్‌మన్ ఐదు పరుగులు తీసేశారు. అలా పాట్ కమిన్స్ ఒక బాల్‌కు ఐదుపరుగులు తీశాడు. దీంతో ఆస్ట్రేలియా స్కోర్ 282 అయింది.

ఈ ఓవర్ త్రో బంతి ఆడుతున్న కంగారూలకు జాయ్‌ను ఇస్తే పాకిస్తాన్ వాళ్ళకు మాత్రం రక్త కన్నీరు కార్పించింది. స్కోర్ బోర్డులో ఒక్కసారిగా ఐదు రన్స్ పెరగడంతో కామేంటటర్లు కూడా ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ఇదొక కొత్త రికార్డ్ అయింది. ఒక బాల్‌కు నాలుగు రన్స్ ఇప్పటివరకు రికార్డ్‌గా ఉంటే ఇప్పుడు ఒక బాల్‌కు ఐదు రన్స్ రికార్డ్‌ సృష్టించింది.

Also Read : AP Elections 2024: పల్నాడు వైసీపీలో టికెట్ల పంచాయితీ.. మంత్రి అంబటితో పాటు ఆ ఇద్దరు ఎమ్మెల్యేల పరిస్థితేంటి?

Advertisment
తాజా కథనాలు