పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యాయి. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీయే సర్కార్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఆగస్టు 12 వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈరోజు ప్రారంభమైన సమావేశాలల్లో విపక్ష నేతలు నీట్ అంశాన్ని తీసుకొచ్చారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేపర్ లీక్ చాలాపెద్ద సమస్య అంటూ విపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. దీంతో కేంద్ర విద్యాశాఖమంత్రి దీనిపై కౌంటర్ ఇచ్చారు. నీట్ పరీక్షను యూపీఏ ప్రభుత్వమే తీసుకొచ్చిందని ఆరోపించారు. పేపర్ లీక్‌పై సీఐబీ విచారణ చేస్తోందంటూ మరోసారి స్పష్టం చేశారు.
Also Read: RRR సంచలనం.. నేరుగా జగన్ దగ్గరికి వెళ్ళి చెవిలో వార్నింగ్!