Paralympics : పారాలింపిక్స్‌.. భారత్‌ ఖాతాలో రెండో స్వర్ణం!

పారిస్‌ పారాలింపిక్స్‌ భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. బ్యాడ్మింటన్‌ పురుషుల సింగిల్స్‌ ఎస్‌ఎల్‌3లో నితేశ్‌ కుమార్ స్వర్ణ పతకం గెలిచాడు. మొదటిసారి విశ్వక్రీడల్లో పాల్గొన్న నితేశ్ అరంగేట్రంలోనే పసిడి సాధించాడు. షూటర్ అవనీ లేఖరా తొలి స్వర్ణం అందించిన విషయం తెలిసిందే.

Paralympics : పారాలింపిక్స్‌.. భారత్‌ ఖాతాలో రెండో స్వర్ణం!
New Update

India : పారిస్‌ (Paris) పారాలింపిక్స్‌ (Paralympics) లో భారత అథ్లెట్లు అదరగొడుతున్నారు. ఇప్పటికే 8 పతాకాలు భారత్ ఖాతాలో చేరగా.. సోమవారం భారత్ రెండో స్వర్ణం సొంతంచేసుకుంది. బ్యాడ్మింటన్‌ పురుషుల సింగిల్స్‌ ఎస్‌ఎల్‌3లో నితేశ్‌ కుమార్ (Nitesh Kumar) స్వర్ణ పతకం గెలిచాడు. మొదటిసారి విశ్వక్రీడల్లో పాల్గొన్న నితేశ్ అరంగేట్రంలోనే పసిడి సాధించాడు. ఇప్పటికే షూటర్ అవనీ లేఖరా తొలి స్వర్ణం అందించిన విషయం తెలిసిందే. కాగా పురుషుల డిస్కస్ త్రో ఎఫ్‌56 ఈవెంట్‌లో యోగేశ్ కథునియా సోమవారం రజతం కైవసం చేసుకున్నాడు.

Also Read : వరదల్లో బోట్ల దందా.. రూ.1500 నుంచి 4 వేలు వసూలు

#paralympics-2024 #nitesh-kumar #2024-paris-olympics #gold-medal
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe