Paralympics : పారాలింపిక్స్.. భారత్ ఖాతాలో రెండో స్వర్ణం!
పారిస్ పారాలింపిక్స్ భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఎస్ఎల్3లో నితేశ్ కుమార్ స్వర్ణ పతకం గెలిచాడు. మొదటిసారి విశ్వక్రీడల్లో పాల్గొన్న నితేశ్ అరంగేట్రంలోనే పసిడి సాధించాడు. షూటర్ అవనీ లేఖరా తొలి స్వర్ణం అందించిన విషయం తెలిసిందే.