Vinesh Phogat: మరికొన్ని గంటల్లో సీఏఎస్ తీర్పు.. వినేష్ ఫోగాట్‌కు న్యాయం జరిగేనా!?

భాతర రెజ్లర్ వినేష్ ఫోగాట్ ఇష్యూపై ఈ రోజు రాత్రి 9:30 గంటలకు సీఏఎస్ తీర్పు వెల్లడించనుంది. తనకు రజతం ఇవ్వాలని వినేష్ ఫోగాట్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ పూర్తైంది. ఒలింపిక్స్ వేడుకలు ముగిసేలోగా తీర్పు వెలువడుతుందని సీఏఎస్ ఒక ప్రకటనలో పేర్కొంది.

Vinesh Phogat: మరికొన్ని గంటల్లో సీఏఎస్ తీర్పు.. వినేష్ ఫోగాట్‌కు న్యాయం జరిగేనా!?
New Update

Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్‌లో అనర్హత వేటుకు గురైన భారతీయ స్టార్ రెజ్లర్ వినేష్‌ ఫోగాట్ (Vinesh Phogat) ఇష్యూలో నేడు సీఏఎస్ (CAS) తీర్పు వెల్లడించనుంది. 100 గ్రాముల అధిక బరువు కారణంగా 50 కేజీల రెజ్లింగ్‌ ఫైనల్ ఫైట్‌కు దూరమైన ఫోగాట్.. సేమీ ఫైనల్ మ్యాచ్ గెలిచినందుకు తనకు పతకం (Silver Medal) ఇవ్వాలంటూ కోర్టును ఆశ్రయించింది. దీంతో భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ చేసిన విజ్ఞప్తిపై కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (CAS) తాత్కాలిక విభాగం శనివారం రాత్రి 9:30 గంటలకు తీర్పు ఇవ్వనుంది.

విచారణ పూరైంది..
ఇక ఒలింపిక్ క్రీడల్లో చోటుచేసుకున్న వివాదాల పరిష్కారం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన తాత్కాలిక సీఏఎస్ కోర్టు.. ఈ ఒలింపిక్స్ ముగిసేలోగా తీర్పు వెల్లడిస్తామని ఒక ప్రకటనలో పేర్కొంది. 'విచారణ పూరైంది. సీఏఎస్ తాత్కాలిక విభాగం ప్రెసిడెంట్ ప్యానెల్ తుది నిర్ణయాన్ని 2024 ఆగస్టు 10 రాత్రి 9:30 ప్రకటించనుంది' అని ఓ అధికారి మీడియాతో తెలిపారు.

ఇది కూడా చదవండి: Aman: ఈ అనాథ విజయం ప్రపంచానికి స్ఫూర్తి.. ఒలింపిక్ విజేత అమన్ లైఫ్ స్టోరీ ఇదే!

ఇక సెమీస్ లో తన చేతిలో ఓడిన క్యూబా రెజ్లర్ యుస్నీలిస్ గుజ్మాన్ లోపెజ్‌తో కలిపి తనకు రజతం ఇవ్వాలని వినేష్ ఫోగట్ విజ్ఞప్తి చేసింది. వినేష్‌ తరఫు న్యాయవాదులు హరీష్ సాల్వే, విదుష్పత్ సింఘానియా ఆ పతకం వినేష్‌ కు మాత్రమే చెందాలని వాదించారు. ప్రస్తుత పరిస్థితులపై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసి) అధ్యక్షుడు థామస్ బాచ్ స్పందిస్తూ.. వినేష్ పట్ల తనకు ఖచ్చితమైన అవగాహన ఉందన్నారు. ఆమె చిన్న కారణంతో ఫైనల్ పోటీనుంచి అనర్హతకు గురికావడం తనను ఇప్పటికీ ఆశ్చర్యపరుస్తూనే ఉందని చెప్పారు.

#paris-olympics-2024 #vinesh-phogat #silver-medal #vinesh-phogat-issue
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe