Paris Olympics 2024: మరొక్క అడుగు.. సెమీస్‌కు దూసుకెళ్లిన వినేశ్ ఫోగట్! భారత మహిళా రెజ్లర్ వినేశ్ ఫోగట్ సెమీస్‌లో అడుగుపెట్టింది. మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ విభాగం క్వార్టర్స్‌లో ఉక్రెయిన్‌కు చెందిన లివచ్ ఒక్సానాపై 7-5 తేడాతో విజయం సాధించింది. వినేశ్ సెమీస్‌లో గెలిస్తే భారత్ ఖాతాలో మరో పతకం చేరనుంది. By srinivas 06 Aug 2024 in ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ New Update షేర్ చేయండి Vinesh Phogat: పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం ఖాయంగా కనిపిస్తోంది. మహిళా రెజ్లర్ వినేశ్ ఫోగట్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ విభాగం క్వార్టర్స్‌లో ఉక్రెయిన్‌కు చెందిన లివచ్ ఒక్సానాపై (Oksana Livach) 7-5 తేడాతో విజయం సాధించి సెమీస్‌లో అడుగుపెట్టింది. 🇮🇳🔥 𝗔𝗻𝗼𝘁𝗵𝗲𝗿 𝘁𝗼𝗽 𝘄𝗶𝗻 𝗳𝗼𝗿 𝗩𝗶𝗻𝗲𝘀𝗵 𝗣𝗵𝗼𝗴𝗮𝘁! Vinesh Phogat was brilliant once again, defeating Oksana Livach in the quarter-final in the women's freestyle 50kg category. Oksana applied pressure on Vinesh in the last minute but Vinesh Phogat showed her class… pic.twitter.com/QhZ4AFRRUr — India at Paris 2024 Olympics (@sportwalkmedia) August 6, 2024 అంతకుముందు మహిళల ఫ్రీస్టైల్ 50 కేజీల రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లో జపాన్‌కు చెందిన డిఫెండింగ్ ఛాంపియన్ సుసాకీని వినేశ్ ఫోగట్ ఓడించి క్వార్టర్ ఫైనల్‌లోకి ప్రవేశించింది. ఆమెను 3-2 తేడాతో ఓడించింది. ఇక వినేశ్ సెమీస్‌లో గెలిస్తే భారత్‌కు మరో పతకం లభించనుండగా.. మంగళవారం రాత్రి సెమీ ఫైనల్‌లో గబిజా డిలైట్ లేదా యుస్నీలిస్ లోపెజ్‌తో వినేశ్ ఫోగట్ తలపడుతుంది. #paris-olympics-2024 #semi-finals #vinesh-phogat మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి