India At Olympics: ఒలింపిక్స్‌లో దూసుకుపోతున్న హాకీ జట్టు.. అర్జెంటీనాతో మ్యాచ్ డ్రా!

పారిస్ ఒలింపిక్స్ లో భారత హాకీ టీమ్ సత్తా చాటుతోంది. ఓపెనింగ్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై విజ‌యం సాధించిన భారత్.. సోమవారం అర్జెంటీనాతో జరిగిన మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. ఈ మ్యాచ్ డ్రా కావడంతో భారత్ నాలుగు పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది.

New Update
India At Olympics: ఒలింపిక్స్‌లో దూసుకుపోతున్న హాకీ జట్టు.. అర్జెంటీనాతో మ్యాచ్ డ్రా!

Indian Hockey Team: పారిస్ ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు దూసుకుపోతుంది. శ‌నివారం జ‌రిగిన ఓపెనింగ్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. కాగా సోమవారం అర్జెంటీనాతో (Argentina) జ‌రిగిన మ్యాచ్ డ్రా చేసుకుంది. దాదాపు భారత ఓటమి కాయమనున్న దశలో చివ‌రి నిమిషంలో కెప్టెన్ హ‌ర్మన్‌ప్రీత్ సింగ్ (Captain Harmanpreet Singh) పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మ‌లిచి ఇండియా శిబిరంలో ఆశలు నింపాడు. ఇక ఇండియా తర్వాత మ్యాచుల్లో ఆస్ట్రేలియా, బెల్జియం జ‌ట్లతో పోటీపడనుంది.

అయితే మ్యాచ్ మొద‌టి నుంచి రెండు జ‌ట్లు తీవ్రంగా గోల్ కోసం పోటీప‌డగా.. అర్జెంటీనా త‌ర‌పున 22వ నిమిషంలో లూకాజ్ మార్టినేజ్ గోల్ అందించాడు. ఇండియా వెనుకంజ‌లో నిలిచింది. పెనాల్టీ కార్నర్లు వ‌స్తున్నా వాటిని గోల్స్‌గా ఇండియా మ‌ల‌చ‌లేక‌పోయింది. ఆట 5 నిమిషాల్లో ముగుస్తుంద‌న్న స‌మ‌యంలో ఇండియా గోల్‌కీప‌ర్‌ శ్రీజేశ్ కూడా రంగంలోకి దిగి భారత్ ను పోటీలో నిలిపారు.

ఇక తొలి మ్యాచ్ లో 3-2 తేడాతో న్యూజిలాండ్ ను భారత్ ఓడించగా.. హర్మన్ ప్రీత్ సింగ్ రెండు గోల్స్ చేశాడు. పూల్ బి లో బెల్జియం ఆడిన రెండు మ్యాచ్ ల్లో గెలిచి ఆరు పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. భారత్ తన చివరి మూడు మ్యాచ్ ల్లో ఆస్ట్రేలియా, బెల్జియం, ఐర్లాండ్‌తో ఆడాల్సి ఉంది. జూలై 30 ఐర్లాండ్ తో మ్యాచ్ ఆడుతుంది. ఒక్కో పూల్ నుంచి మొదటి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి.

Also Read: 2028 ఒలింపిక్స్‌లోకి క్రికెట్‌ ఎంట్రీ.. పతకం కోసం సిద్ధంగా ఉన్నామన్న ద్రావిడ్!

Advertisment
తాజా కథనాలు