SKM : మోడీ సర్కార్ కు 'ఎస్‌కేఎం' షాక్.. 500 జిల్లాల్లో ట్రాక్టర్ పరేడ్!

మోడీ సర్కార్‌ ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక విధానాలపై జనవరి 26న దేశవ్యాప్తంగా 500 జిల్లాలో ట్రాక్టర్ పరేడ్ చేపట్టబోతున్నట్లు ‘సంయుక్త కిసాన్‌ మోర్చా’ ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని ట్రాక్టర్‌ పరేడ్‌ను విజయవంతం చేయాలని కోరింది.

New Update
SKM : మోడీ సర్కార్ కు 'ఎస్‌కేఎం' షాక్.. 500 జిల్లాల్లో ట్రాక్టర్ పరేడ్!

Samyukta Kisan Morcha : మోడీ(Modi) సర్కార్‌కు ‘సంయుక్త కిసాన్‌ మోర్చా’(Samyukta Kisan Morcha) మరోసారి షాక్ ఇచ్చింది. బీజేపీ(BJP) ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక విధానాలపై రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా రైతు సంఘాల ఐక్య వేదిక(SKM) మరోసారి పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టబోతున్నట్లు ప్రకటించింది.

ఈ మేరకు దేశవ్యాప్తంగా జనవరి 26న 500 జిల్లాల్లో రైతుల ట్రాక్టర్ల(Tractor)తో పరేడ్‌ చేపడతామని తెలుపుతూ సంయుక్త కిసాన్‌ మోర్చా బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో రిపబ్లిక్‌ డే వేడుకలు ముగిసిన వెంటనే ట్రాక్టర్‌ ర్యాలీ నిర్వహిస్తామని, ఇందులో దేశవ్యాప్తంగా ఉన్న రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని ట్రాక్టర్‌ పరేడ్‌ను విజయవంతం చేయాలని కోరింది. అలాగే మోదీ సర్కార్‌ అనుసరిస్తున్న రైతు వ్యతిరేక, కార్పొరేట్‌ అనుకూల విధానాల్ని సామాన్యులకు వివరిస్తూ జనవరి 10-20 మధ్య 20 రాష్ర్టాల్లో ‘జన జాగరణ్‌’ను చేపడుతున్నట్టు పేర్కొంది. రైతుల డిమాండ్లు నెరవేరే వరకు తమ పోరాటం కొనసాగుతుందని వెల్లడించిన ఎస్‌కేఎం (SKM).. ‘అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 500 జిల్లాల్లో ట్రాక్టర్‌ పరేడ్‌ చేపడతాం. ట్రాక్టర్లు, ఇతర వాహనాలతో రైతులు పరేడ్‌లో పాల్గొనవచ్చు. ప్రజాస్వామ్యం, లౌకికవాదం, ఫెడరిలిజం, సోషలిజం సూత్రాల్ని పరిరక్షిస్తామని రైతులు ప్రతిజ్ఞ చేయనున్నారు’ అని వెల్లడించింది.

ఇది కూడా చదవండి : TS Govt Jobs: తెలంగాణలో ఆ ఉద్యోగ అభ్యర్థులకు అలర్ట్.. రేపటి నుంచే సర్టిఫికేట్ వెరిఫికేషన్లు!

ఇదిలావుంటే.. అక్టోబర్ నెలలో రైతులు ఉద్యమం పేరుతో శాంతిభద్రతలకు ఆటంకం సృష్టించారని, ఇందుకోసం విదేశీ నిధులను పొందిందంటూ మోడీ గవర్నమెంట్ ఆరోపణలను రైతు వేదిక ఖండించింది. ఇది BJP-RSS నేతృత్వంలోని ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకోవడానికి చేస్తున్న ప్రయత్నమని పేర్కొంది. రైతు ఉద్యమంపై పునరుద్ధరించబడిన దాడి'కి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు ప్రారంభించాలని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. కాగా అక్టోబర్ 3న ఢిల్లీ పోలీసులు ఎస్ కేఎం వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థ(Prabir Purkayastha), హెచ్‌ఆర్ హెడ్ అమిత్ చక్రవర్తి(Amit Chakravarty)ని అరెస్టు చేసింది.

Advertisment
తాజా కథనాలు