Paris Para Olympics: పారిస్ లో మళ్ళీ ఒలింపిక్స్ సందడి..అట్టహాసంగా పారా ఒలిపింక్స్ వేడుకలు

పారిస్ మళ్ళీ క్రీడాకారులతో కళకళలాడుతోంది. కొన్ని రోజుల క్రితమే ఒలింపిక్స్‌ను ముగించుకున్న పారిస్ ప్రస్తుతం పారా ఒలింపిక్స్‌కు వేదిక అయింది. ఈరోజు పారా ఒలింపిక్స్ ప్రారంభం వేడుకలు అట్టహాసంగా జరిగాయి. సెప్టెంబర్ 8వరకు ఇవి జరగనున్నాయి.

New Update
Paris Para Olympics: పారిస్ లో మళ్ళీ ఒలింపిక్స్ సందడి..అట్టహాసంగా పారా ఒలిపింక్స్ వేడుకలు

Para Olympics 2024: దేశవిదేశ క్రీడాకారులు, క్రీడా అభిమానులతో పారిస్ సందడిగా మారింది. పారాలింపిక్స్‌ 2024 పారిస్‌ లో అట్టహాసంగా ప్రారంభమైంది. డిలా కాంకార్డ్‌ వేదికగా తొలిసారి బహిరంగ ప్రదేశంలో వేడుకలను ప్రారంభించారు. ఈ సంబరాలకు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌, బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ చెక్‌ రిపబ్లిక్‌ అధ్యక్షుడు పీటర్‌ పావెల్‌, జర్మనీ అధ్యక్షుడు ఫ్రాంక్‌ వాల్టర్‌ స్టెయిన్‌మీర్‌లతో పాటు పలువురు ప్రముఖులు తరలివచ్చారు. మార్షల్ ఆర్ట్స్ వీరుడు, నటడు అయిన జాకీ చాన్ ఒలింపిక్స్ జ్యోతితో సందడి చేశారు. ఈ ప్రారంభ వేడుకలను చూడ్డానికి వేల సంఖ్యలో అభిమానులు తలివచ్చారు. ప్రారంభ వేడుకల్లో కార్యక్రమాలు ఎప్పటిలనే ఆకట్టుకున్నాయి.

పారాలింపిక్స్‌ క్రీడలు 11 రోజుల పాటూ జరగనున్నాయి. 168 దేశాలకు చెందిన మొత్తం 4,400 క్రీడాకారులు ఇందులో పాల్గొంటున్నారు. సెప్టెంబర్‌ 8న ఇవి ముగియనున్నాయి. భారత్‌ తరఫున 84 మంది అథ్లెట్లు బరిలో ఈసారి పోటీలో ఉన్నారు. మొదటి సారి భారత్ ఇంత మందితో పారాలింపిక్స్ లో పాల్గొంటోంది. క్రీడాకారులు టోక్యోలోని పారా ఒలింపిక్స్‌కు 54 మంది వెళ్లారు. ప్రారంభ వేడుకల్లో పారాలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత సుమిత్‌ అంటిల్‌, ఆసియా పారా క్రీడల రజత పతక విజేత భాగ్యశ్రీ జాదవ్ భారత పతాకధారులుగా వ్యవహరించారు. టోక్యోలో జరిగిన పోటీల్లో భారత్‌ 5 స్వర్ణాలు సహా 19 పతకాలు సాధించి పాయింట్ల పట్టికలో 24 స్థానంలో నిలిచింది.

Also Read: Andhra Pradesh: ఏపీకి డబుల్ ధమాకా..స్మార్ట్ సిటీలుగా కొప్పర్తి, ఓర్వకల్‌..

Advertisment
తాజా కథనాలు