Pakistan Team: మీ కష్టం పగోడికి కూడా రాకూడదు భయ్యా.. లగేజీలు మోసుకున్న పాకిస్థాన్‌ ఆటగాళ్లు!

ఆస్ట్రేలియా-పాకిస్థాన్‌ మధ్య మూడు టెస్టుల సిరీస్‌ డిసెంబర్ 14 నుంచి ప్రారంభంకానుంది. సిరీస్‌ ఆడేందుకు పాక్‌ జట్టు ఆస్ట్రేలియాలో అడుగుపెట్టగా.. వారిని రిసీవ్ చేసుకునేందుకు ఎవరూ రాలేదు. పాక్‌ ఆటగాళ్లు వారి లగేజీని వారే మోసుకున్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

New Update
Pakistan Team: మీ కష్టం పగోడికి కూడా రాకూడదు భయ్యా.. లగేజీలు మోసుకున్న పాకిస్థాన్‌ ఆటగాళ్లు!

పాకిస్థాన్‌ క్రికెట్‌(Pakistan Cricket)కు పట్టిన శని ఇప్పుడిప్పుడే వదిలేలా కనిపించడంలేదు. వరల్డ్‌కప్‌లో కనీసం సెమీస్‌కు కూడా చేరలేకపోయిన పాక్‌ టీమ్‌ గురించి అంతా చులకన చేసి మాట్లాడుతున్నారు. ఈ స్థితిని పాకిస్థానే తెచ్చుకుంది. ఆట కంటే ఇతర విషయాలపై ఫోకస్‌ చేయడం.. జట్టులో యూనిటీ లేకపోవడం పాక్‌ కొంప ముంచింది. ఇక టీమ్‌ సెలక్షన్‌లోనూ రాజకీయాలే. ఇదంతా పాక్‌ ఓటమిని ప్రభావితం చేసింది. అందుకే వరల్డ్‌కప్‌లో పసికూనల చేతిలోనూ ఓడిపోయింది. టోర్నీ తర్వాత బాబర్‌ అజాయ్‌ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ఇక తాజాగా ఆస్ట్రేలియా టూర్‌(Australia Tour)కు వెళ్లింది పాక్‌ జట్టు. అక్కడకు చేరుకున్న తర్వాత ఆ జట్టును ఎవరూ పట్టించుకోకపోవడంతో హాట్‌టాపిక్‌గా మారింది. ఇంతకీ ఆస్ట్రేలియా ఎయిర్‌పోర్టులో ఏం జరిగింది?


ఏం జరిగిందంటే?
డిసెంబర్‌ 14న నుంచి పాక్‌-ఆస్ట్రేలియా మధ్య టెస్టు సిరీస్‌ మొదలుకానుంది. మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం తాజాగా ఆస్ట్రేలియాలో అడుగుపెట్టింది పాక్‌ క్రికెట్ జట్టు. అయితే ఎయిర్‌పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన పాక్‌ జట్టు షాక్‌ అయ్యింది. తమను రిసీవ్ చేసుకునేందుకు అక్కడ ఎవరూ రాలేదు. క్రికెట్‌ ఆస్ట్రేలియా అసలు పట్టించుకోలేదు. పోని పాకిస్థాన్‌ ఎంబసీ ఇన్ ఆస్ట్రేలియా ఏమైనా వెల్‌కమ్‌ చెప్పిందా అంటే అదీ లేదు. దీంతో పాక్‌ ఆటగాళ్లు షాక్‌ అయ్యారు. అయితే కాసేపటి తర్వాత పెద్దగా పట్టించుకోలేదు. వారి సామానును వారే ట్రక్కులో ఎక్కించుకున్నారు. ఇక ఆస్ట్రేలియా పర్యటన కోసం కొత్త కెప్టెన్‌గా షాన్ మసూద్‌ని ఎంపిక చేశారు.

వీడియో వైరల్‌:
పాకిస్థాన్‌ ఆటగాళ్లు సామాన్లు మోస్తున్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఇదే సీన్‌ను వరల్డ్‌కప్‌లో జరిగిన సీన్లతో కంపేర్ చేస్తున్నారు ఫ్యాన్స్. పాక్ జట్టు వరల్డ్‌కప్‌ ఆడేందుకు ఇండియా వచ్చిన విషయం తెలిసిందే. ఇక్కడ పాక్‌ ఆటగాళ్లకు మంచి వెల్కమ్‌ లభించింది. హైదరాబాద్‌ లోకల్‌ ఫ్యాన్స్‌ కూడా ఆటగాళ్లను చూసేందుకు వచ్చారు. అయితే టోర్నీ మధ్యలో భారత్‌లో నిర్వాహణ బాగోలేదని బీసీసీఐపై ఐసీసీకి ఫిర్యాదు చేసింది పాకిస్థాన్‌. ఇప్పుడిదే విషయాన్ని గుర్తు చేస్తున్నారు ఫ్యాన్స్. ఆస్ట్రేలియాలో అడుగుపెడితే కనీసం లగేజీ మోసేవాళ్లు కూడా లేరని.. ఇండియాలో అభిమానులు కూడా మద్దతు ఇచ్చారని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: పక్కకు తప్పుకోండి తమ్ముళ్లూ.. పాకిస్థాన్‌ను కిందకు పడేసిన టీమిండియా!

WATCH: 

Advertisment
Advertisment
తాజా కథనాలు