AUS VS PAK: లిఫ్ట్‌లో ఇరుక్కున్న అంపైర్.. ఆగిపోయిన మ్యాచ్.. తర్వాత ఏం జరిగిందంటే?
మెల్బోర్న్లో ఆస్ట్రేలియా-పాకిస్థాన్‌ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో మూడో రోజు లంచ్ తర్వాత వింత ఘటన జరిగింది. థర్డ్ అంపైర్ రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ లిఫ్ట్‌లో ఇరుక్కుపోవడంతో మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.