Cricket News: పక్కకు తప్పుకోండి తమ్ముళ్లూ.. పాకిస్థాన్‌ను కిందకు పడేసిన టీమిండియా! టీ20 చరిత్రలో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా టీమిండియా మరో మైలురాయిను అందుకుంది. ఆస్ట్రేలియాపై నాలుగో టీ20లో గెలుపుతో ఈ ఫీట్ సాధించింది. 213 టీ20 మ్యాచ్‌ల్లో భారత్ 136 విజయాలు సాధించగా.. 226 మ్యాచ్‌ల్లో పాక్ 135 విన్స్ కొట్టింది. By Trinath 02 Dec 2023 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి టీ20 ప్రపంచకప్(World Cup) సాధించిన తొలి టీమ్ టీమిండియానే. 2007లో తొలిసారి టీ20 ప్రపంచకప్ జరగగా.. ధోనీ కెప్టెన్సీలోని భారత్ జట్టు విశ్వవిజేతగా నిలిచింది. ఇలా ఇండియాకు పొట్టి ఫార్మెట్‌లో తొలి నుంచి మంచి విక్టరీలే ఉన్నాయి. తర్వాత వరల్డ్‌కప్ గెలవకున్నా నిలకడగానే రాణిస్తూ వస్తోంది. మంచి విజయాలు సాధిస్తోంది. అటు వన్డే, టెస్టుల్లో చారిత్రాక విజయాలు సొంతం చేసుకుంటూనే టీ20పైనే మంచి పట్టు కంటీన్యూ చేసింది. అయితే 2007 టీ20 ప్రపంచకప్ తర్వాత మరోసారి టైటిల్ గెలవకపోవడం అభిమానులను నిరాశ పరిచే అంశం. ఇక తాజాగా వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లోనూ భారత్ ఓడిపోడడాన్ని ఫ్యాన్స్ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక వరల్డ్‌కప్ ముగిసిన తర్వాత నాలుగు రోజులకే ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ మొదలుపెట్టింది ఇండియా. నిన్న(డిసెంబర్ 1) వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై విజయం సాధించిన భారత్ సరీస్‌ను కైవసం చేసుకోవడంతో పాటు మరో మైలురాయిను అందుకుంది. Indian Cricket Team Break The Record Of Pakistan T20 After Australia Serieshttps://t.co/SSYcWA9QCy .#INDvsSA #INDvsAUS #T20WorldCup #Honeymoon pic.twitter.com/Xo15dAzqJB — Rylo News (@NewsRylo) December 2, 2023 టాప్ విన్నింగ్ టీమ్: రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో శుక్రవారం (డిసెంబర్ 1) జరిగిన ఇండియా, ఆస్ట్రేలియా నాలుగో టీ20లో సూర్యభాయ్ జట్టు 20 రన్స్ తేడాతో కంగారూలను ఓడించింది. డిసెంబర్ 3న(రేపు) ఐదో టీ20 జరగనుండగా.. నిన్నటి గెలుపుతోనే భారత్ సిరీస్ వశం చేసుకుంది. ఇది టీ20 చరిత్రలో భారత్‌కు 136వ విజయం. ఈ గెలుపుతో 135 విజయాలతో టాప్ ప్లేస్‌లో ఉన్న పాకిస్థాన్ రికార్డు బద్దలైంది. టీ20ల్లో అత్యధిక విజయాలు 136 - భారత్, మ్యాచ్‌లు-213 135 - పాకిస్థాన్, మ్యాచ్‌లు-226 102 - న్యూజిలాండ్, మ్యాచ్‌లు-200 95 - దక్షిణాఫ్రికా, మ్యాచ్‌లు-171 95 - ఆస్ట్రేలియా,మ్యాచ్‌లు-181 Also Read: జస్ట్ మిస్..లేకపోతే అంపైర్ అవుట్..జితేష్ స్ట్రోక్ అలాంటిది మరి! WATCH: #pakistan-cricket #cricket #indian-team #india-vs-australia మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి