పాకిస్థాన్ మ్యాచ్‌లకు భద్రత ఇవ్వలేం..! వరల్డ్ కప్ టోర్నీలో పాక్ మ్యాచ్‌లపై మరోసారి సందిగ్ధత నెలకొంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగాల్సిన మ్యాచ్‌లపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. పాక్ మ్యాచ్‌కు తాము భద్రత కల్పించలేమని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) బీసీసీఐకి తెలిపింది. By Karthik 06 Aug 2023 in స్పోర్ట్స్ New Update షేర్ చేయండి భారత్‌లో జరగబోయే వన్డే వరల్డ్ కప్ మెగా టోర్నీలో పాకిస్థాన్ క్రికెట్ టీమ్ పాల్గొనడం లేదా.. బీసీసీఐకి బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ రాసిన లేఖలో ఏముంది..? మ్యాచ్‌ల తేదీలు ఖరారయ్యాక.. ఇప్పుడు ఇదేం ట్విస్ట్. బీసీసీఐ ఆలోచన విధానం ఎలా ఉంది. ఆ రోజు మ్యాచ్ నిర్వహిస్తారా..? దానికి రిజర్వ్ డేను తీసుకుంటారా.. వన్డే వరల్డ్ కప్ సమయం దగ్గర పడుతుండగా.. పాకిస్తాన్ టీమ్ ఆడే మ్యాచ్‌లపై సందిగ్థత నెలకొంది. మొదట పాక్ ఆడే అన్ని మ్యాచ్‌లు గుజరాత్‌లోని నరేంద్ర మోడీ స్టేయంలో నిర్వహిస్తామని బీసీసీఐ తెలుపగా దీనికి పాక్ క్రికెట్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. తమ జట్టు గుజరాత్‌కు వెళ్లబోదని స్పష్టం చేసింది. దీంతో ప్రత్యమ్నాయ వేదికగా కోల్‌కతా ఎక్కువ మ్యాచ్‌లు ఆడే విధంగా షెడ్యూల్ విడుదల చేశారు. దీనికి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సైతం అంగీకరించింది. దీంతో పాక్ మ్యాచ్‌లపై ఉత్కంఠ వీడినట్లైందని అందరూ భావించారు. అయితే పాక్ ఆడాల్సిన మ్యాచ్‌లకు తాము భద్రత కల్పించలేమని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ చెబుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. షెడ్యూల్ ప్రకారం.. నవంబర్ 12న కోల్‌కతా వేదికగా పాకిస్థాన్- ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్ జరుగాల్సి ఉంది. కానీ ఆ రోజు బెంగాల్‌లో కాళీ పూజ జరుగుతుందని, ఆ పూజకు భారీ స్థాయిలో భందోబస్తు ఉంటుందని, దీంతో ఆ మ్యాచ్‌కు భద్రత ఇవ్వలేమని పోలీస్ శాఖ బెంగాల్ క్రికెట్ అసోసియేషన్‌కి స్పష్టం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మామూలుగానే ఇండియాలో పాక్ మ్యాచ్ అంటే ఎక్కువ టెన్షన్ ఉంటుంది. ఆ మ్యాచ్‌లకు పోలీస్ బందోబస్తు ఇతర దేశాల ఆటగాళ్లు వచ్చిన సమయం కంటే పది రేట్లు ఉంటుంది. మరి అదే రోజు కాళి మాత పూజ ఉండటంతో మ్యాచ్‌పై సందిగ్ధత ఏర్పడింది. దీనిపై క్యాబ్ సైతం బీసీసీఐకి తెలిపినట్లు సమాచారం. కానీ దీనిపై స్పందించిన క్యాబ్ అధ్యక్షుడు స్నేహశిష్ గంగూలీ అవి తప్పుడు వార్తలని, భద్రత పరమైన చర్యలపై పోలీసుల నుంచి తమకు ఎలాంటి లేఖ అందలేదన్నారు. ప్రపంచ కప్‌లో పాకిస్థాన్ షెడ్యూల్‌ను పరిశీలిస్తే.. అక్టోబర్ 6న పాక్ హైదరాబాద్ వేదికగా క్వాలిఫయర్ మ్యాచ్ ఆడుతుంది. అక్టోబర్ 12న హైదరాబాద్ వేదికగానే 2వ క్వాలీఫయర్ మ్యాచ్ ఆడనుంది. అక్టోబర్ 15న పాకిస్థాన్ అహ్మదాబాద్‌లో భారత్‌తో తలపడనుంది. అక్టోబర్ 20న బెంగళూరు వేదికగా ఆస్ట్రేలియాతో తలపడనుంది. అక్టోబర్ 21న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ గ్రౌండ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది. అదే నెల 23న చెన్నైలో అప్ఘనిస్థాన్‌తో తలపడనుంది. మరోవైపు అక్టోబర్ 27 మళ్లీ ఈడెన్ గార్డెన్స్ గ్రౌండ్‌లో దక్షిణాఫ్రికాను ఢీకొట్టనుంది. నవంబర్ 5న పాకిస్థాన్ బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియంలో న్యూజిలాండ్‌తో తలపడనుండగా.. నవంబర్ 12న కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో ఇంగ్లాండ్ టీమ్‌తో తలపడనుంది. కాగా అక్టోబర్ 21, నవంబర్ 12న జరగబోయే మ్యాచ్‌లపై సందిగ్ధత నెలకొంది. #pakistan #bcci #security #world-cup #bengal-cricket-association #kali-puja మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి