మా దేశం విడిచివెళ్లాలంటే రూ.69 వేలు కట్టాల్సిందే..

పాకిస్థాన్‌ను వీడివెళ్తున్న అఫ్ఘానిస్థాన్‌ శరణార్థుల నుంచి ఎగ్జిట్ ఛార్జీలు వసూల్ చేయాలని పాక్ ప్రభుత్వం నిర్ణయించింది. అక్రమంగా తమ దేశంలో ఉండి వేరే దేశాలకు వెళ్లాలనుకునే వారు 830 డాలర్లు (రూ.69 వేలు) చెల్లించేలా ఓ విధానాన్ని తీసుకొచ్చింది. ఈ చర్యను పలు దేశాలు ఖండిస్తున్నాయి.

మా దేశం విడిచివెళ్లాలంటే రూ.69 వేలు కట్టాల్సిందే..
New Update

గత కొంతకాలంగా పాకిస్థాన్‌ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు పాకిస్థాన్‌ ఒక కొత్త మార్గాన్ని ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. పాకిస్థాన్‌ను వదిలివెళ్లిపోతున్న అఫ్గానిస్థాన్ శరణార్థుల నుంచి ఎగ్జిట్‌ ఛార్జీలను వసూలు చేయాలని పాక్ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. రెండేళ్ల క్రితం అఫ్గానిస్థాన్‌లో పౌర ప్రభుత్వాన్ని కూల్చేసి తాలిబన్లు అధికారం చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన వల్ల అఫ్ఘాన్‌వాసులు వివిధ దేశాలకు శరణార్థులుగా వలస వెళ్లిపోయారు. వీళ్లలో దాదాపు 21.3 లక్షల మంది పాకిస్థాన్‌కు వచ్చేశారు. పర్మిషన్ లేకుండా తమ దేశంలో ఉంటున్న అఫ్ఘానిస్తాన్‌ ప్రజల్ని స్వదేశం పంపించేందుకు పాక్‌ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది.

Also read: ఎన్నికల వేళ.. 24 గంటల్లో రూ.14 కోట్ల సొత్తు స్వాధీనం చేసుకున్న పోలీసులు..

అక్రమంగా తమ దేశంలో ఉంటున్నవారు నవంబర్ 1 నాటికే తమ దేశం విడిచి వెళ్లిపోవాలని పాక్‌ గతంలోనే హెచ్చరించింది. కానీ నవంబర్ 1 దాటినా కూడా అఫ్ఘానిస్థాన్ శరణార్థులు అక్కడే ఉంటున్నారు. దీన్ని అవకాశంగా భావించిన పాక్‌ వారిపై చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే పునరావాస పథకాల ద్వార పాశ్చాత్య దేశాలకు వెళ్లడానికి ఎదురుచూస్తున్న వారు పాకిస్థాన్‌ను వీడాలంటే 830 డాలర్లు అంటే మన కరెన్సీలో రూ.69 వేలు చెల్లించేలా ఓ విధానాన్ని తీసుకొచ్చింది. ఒక్కో వ్యక్తి ఈ మొత్తాన్ని కట్టాల్సి ఉంటుంది. అయితే ఈ చర్యలను పలు దేశాలు ఖండిస్తున్నాయి. అయినప్పటీకీ కూడా తమ దేశ విధానాన్ని మార్చుకునే ఉద్దేశం తమకు లేదని పాకిస్థాన్‌ విదేశాంగ మంత్రి స్పష్టం చేశారు.

Also Read: సిగిరెట్లు, గుట్కాలపై పన్నులు పెంచాలి.. కేంద్రానికి సూచనలు

#pakisthan-news #telugu-news #international-news
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe