Pakistan:పాకిస్తాన్‌లో క్రీస్టియన్ మహిళ...తొలిసారిగా బ్రిగేడియర్‌గా

ముస్లిం దేశమైన పాకిస్తాన్‌లో ఓ మైనారిటీ మహిళకు అరుదైన అవకాశం లభించింది. పాక్‌ ఆర్మీలో మెడికల్ కోర్‌లో పనిచేస్తున్న డాక్టర్ హెలెన్ మేరీ రాబర్ట్స్ బ్రిగేడియర్‌గా పదోన్నతి పొందారు. అక్కడ ఇలా జరగడం ఇదే మొదటిసారి.

New Update
Pakistan:పాకిస్తాన్‌లో క్రీస్టియన్ మహిళ...తొలిసారిగా బ్రిగేడియర్‌గా

Woman Brigadier: పాకిస్తాన్‌లో ఎప్పుడూ జరగని పని జరిగింది. మొదటిసారి అక్కడ ఓ క్రిస్టియన్ మహిళ చరిత్ర సృష్టించింది. అక్కడ మైనారిటీగా భావించే క్రిస్టియన్ మహిళ బ్రిగేడియర్‌గా స్థానం సంపాదించారు. పాకిస్తాన్ ఆర్మీ మెడికల్‌ కోర్‌లో పనిచేస్తున్న డాక్టర్‌ హెలెన్‌ మేరీ రాబర్ట్స్‌ బ్రిగేడియర్‌గా పదోన్నతి పొందారు. పాకిస్థాన్‌ సైన్యంలో బ్రిగేడియర్‌ హోదా పొందిన తొలి మహిళ, క్రైస్తవ మైనారిటీ వ్యక్తిగా చరిత్ర సృష్టించారు.

పాక్ ప్రధాని అభినందనలు..

సీనియర్‌ పాథాలజిస్ట్‌ అయిన డాక్టర్‌ హెలెన్‌ సైన్యంలో 26 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. పాకిస్థాన్‌ లో ముస్లింల మెజారిటీనే ఎక్కువగా ఉంటుంది. ఆ తరువాత హిందువులు అధికంగా ఉంటారు. అయితే అక్కడ క్రైస్తవులు 2.14 శాతం మాత్రమే ఉన్నారు అందుకే అక్కడ వారిని మైనారిటీల కింద లెక్క కడతారు. దాంతో పాటూ ఇందులో మహిళలు ఉద్యోగాల్లో రాణించడం కూడా చాలా అరుదు. అలాంటిది పాక్‌లో అత్యంత కీలక పాత్ర పోషించే సైన్యంలో బ్రిగేడియర్‌ హోదా అంటే మరీ అరుదైన విషయం. అందుకే హెలెన్ బ్రిగేడియర్‌గా అవడం వార్తగా మారింది. హెలెన్‌కు పాకి ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ అభినందనలు తెలిపారు.

Also Read:Mamata Banerjee : ఎగ్జిట్ పోల్స్‌ను బహిష్కరిస్తున్నాం..అసలు ఫలితాల కోసం వెయిట్ చేయాలి-మమతా బెనర్జీ

Advertisment
Advertisment
తాజా కథనాలు