AUS VS PAK: అసలుసిసలైన కిక్‌.. ఉత్కంఠగా పాక్‌-ఆసీస్‌ బాక్సిండ్‌ డే టెస్ట్!

మూడో రోజు ఆటముగిసే సమాయానికి ఆస్ట్రేలియా 6 వికెట్ల నష్టానికి 187 రన్స్ చేసింది. క్రీజులో అలెక్స్‌ క్యారి ఉన్నాడు. మిచెల్‌ స్టార్క్‌ బ్యాటింగ్‌కు రావాల్సి ఉంది. ప్రస్తుతం ఆస్ట్రేలియాకు 241 రన్స్ లీడ్ ఉంది. అంతకముందు మొదటి ఇన్నింగ్స్‌లో పాక్‌ 264 రన్స్‌కు ఆలౌట్ అయ్యింది.

New Update
AUS VS PAK: అసలుసిసలైన కిక్‌.. ఉత్కంఠగా పాక్‌-ఆసీస్‌ బాక్సిండ్‌ డే టెస్ట్!

Australia Vs Pakistan: టెస్టులు బోర్‌ అంటారు కానీ.. అది అందరికి కాదు.. క్రికెట్‌(Cricket)ని ఎంజాయ్‌ చేసేవాళ్లకి టెస్టు మ్యాచ్‌లతోనే అసలైన కిక్‌ వస్తుంది. టీ20ల ప్రవాహంలో టెస్టు మ్యాచ్‌లు చూసే వారి సంఖ్య తగ్గిందని చెబుతుంటారు కానీ.. ఇది అన్నీ వేళలా కరెక్ట్ కాదు. ముఖ్యంగా ఆస్ట్రేలియా, ఇండియా గడ్డలపై జరిగే టెస్టులకు ప్రేక్షక ఆదరణ ఉంటుంది. ఇంగ్లండ్‌, దక్షిణాఫ్రికా(South Africa)లలో జరిగే మ్యాచ్‌లకు సైతం ఫ్యాన్స్‌ స్టేడియానికి వస్తుంటారు. ఇక ప్రస్తుతం టెస్టు సీజన్‌ ఊపందుకుంది. ఓవైపు సఫారీ గడ్డపై ఇండియా-దక్షిణాఫ్రికా తలపడుతుండగా.. మరోవైపు ఆసీస్‌ గడ్డపై పాక్‌-ఆస్ట్రేలియా అమీతుమీ తేల్చుకుంటున్నాయి. మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు రసకందాయంగా సాగుతోంది. మూడో రోజు ఆటలో ఆధిపత్యం కోసం పాక్‌-ఆసీస్‌ నువ్వానేనా అన్నట్టు తలపడ్డాయి.

మూడో రోజు ఆసీస్‌దేనా?
194/6 స్కోరుతో మూడో రోజు ఆట ఆరంభించిన పాకిస్థాన్‌(Pakistan) 264 రన్స్‌కు ఆలౌట్ అయ్యింది. పాక్‌ బ్యాటర్లలో మొత్తం ఇద్దరు హాఫ్‌ సెంచరీలు చేశారు. షఫిక్‌ 62 రన్స్ చేయగా.. మసూద్‌ 54 రన్స్ చేశాడు. ఇక రిజ్వాన్‌ 42 రన్స్‌తో రాణించాడు. చివరిలో జమాల్‌, షాషీన్‌ అఫ్రిది పర్వాలేదనిపించారు. ఇక 54 పరుగుల లీడ్‌తో బ్యాటింగ్‌ ఆరంభించిన ఆస్ట్రేలియా(Australia)కు ఆదిలోనే గట్టి షాక్‌లు తగిలాయి. ఖాతా తెరవకుండానే ఉస్మాన్‌ ఖవాజా వికెట్‌ను కోల్పోయింది. షాహీన్‌ అఫ్రిది బౌలింగ్‌లో ఖవాజా డక్‌ ఔట్‌గా వెనుదిరిగాడు. ఇక వెంటనే లబుషేన్‌, డేవిడ్‌ వార్నర్‌, ట్రావిస్‌ హెడ్‌ సైతం ఔట్ అవ్వడంతో ఆస్ట్రేలియా 16 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది. దీంతో లంచ్‌కు కాసేపు ముందు.. ఆ తర్వాత కాసేపు పాకిస్థాన్‌ ఆధిపత్యం చెలాయించింది.


ఈ క్రమంలో స్మిత్‌తో కలిసి మిచెల్‌ మార్ష్‌ పాక్‌ బౌలర్లను ధీటుగా ఎదుర్కోన్నారు. ముఖ్యంగా మార్ష్‌ పాక్‌ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. అవతలి ఎండ్‌లో స్మిత్‌ అతనికి సపోర్ట్‌గా నిలిచాడు. సెంచరీవైపు దూసుకెళ్తునన మార్ష్‌ని మిర్‌ హమ్జా ఔట్ చేశాడు. 130 బంతుల్లోనే 96 రన్స్‌ చేశాడు మార్ష్‌. 169 రన్స్‌ వద్ద ఆస్ట్రేలియా 5వ వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత కాసేపటికే ఆస్ట్రేలియా స్మిత్‌ వికెట్‌ను కోల్పోయింది. 176 బంతుల్లో 50 రన్స్‌ చేసిన స్మిత్‌ 6వ వికెట్‌గా వెనుదిరిగాడు. స్మిత్‌ వెనుదిరగడంతో డే ముగిసింది. మూడో రోజు ఆస్ట్రేలియా 6 వికెట్ల నష్టానికి 187 రన్స్ చేసింది. క్రీజులో అలెక్స్‌ క్యారి ఉన్నాడు. మిచెల్‌ స్టార్క్‌ బ్యాటింగ్‌కు రావాల్సి ఉంది. ప్రస్తుతం ఆస్ట్రేలియాకు 241 రన్స్‌ లీడ్ ఉంది. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉంది. ఆస్ట్రేలియా లీడ్‌ 300 దాటనివ్వకపోతే పాక్‌ గెలిచే అవకాశాలు ఉంటాయని క్రికెట్ పండితులు చెబుతున్నారు.

Also Read: లిఫ్ట్‌లో ఇరుక్కున్న అంపైర్‌.. ఆగిపోయిన మ్యాచ్‌.. తర్వాత ఏం జరిగిందంటే?

WATCH:

Advertisment
తాజా కథనాలు