Arshad Nadim: పాక్ అథ్లెట్ నదీమ్‌కు బహుమతుల వెల్లువ

పారిస్ ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రోలో స్వర్ణాన్ని సాధించిన పాక్ అథ్లెట్ అర్షద్ నదీమ్‌కు తమ దేశం నుంచి భారీ బహుమతులు వెల్లువెత్తుతున్నాయి. పాకిస్తాన్‌కు మొట్టమొదటిసారి గోల్డ్‌ మెడల్‌ అందించిన నదీమ్‌కు ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని ఇవ్వనున్నారు.

Arshad Nadim: పాక్ అథ్లెట్ నదీమ్‌కు బహుమతుల వెల్లువ
New Update

Pak Athlete Arshad Nadim: పాక్ అథ్లెట్ నదీమ్‌కు భారీ బహుమతులు వెల్లువెత్తుతున్నాయి. తమ దేశానికి మొట్టమొదటి బంగారు పతకాన్ని నదీమ్ తీసుకురావడంతో అక్కడ సంబరాలు చేసుకుంటున్నారు. దాంతో పాటూ అతనిపై ప్రశసల వర్షం కురుస్తోంది. క్రికెట్ర్లు, సెలబ్రిటీలు నదీమ్‌ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. మరోవైపు పాక్ ప్రభుత్వం కూడా అతనిని ఘనంగా సత్కరించేందుకు ఏర్పాట్లను చేస్తోంది. దీంతో పాటూ నదీమ్‌కు భారీ బహుమతులు కూడా ప్రకటిస్తున్నారు. అన్నీ కలిపి అతను మొత్తం నదీమ్‌ 150 మిలియన్‌ పాకిస్థాన్‌ రూపాయల (రూ.4.5 కోట్లు) కంటే ఎక్కవ మొత్తం అందుకోనున్నట్లు తెలుస్తోంది.

ఇందులో పంజాబ్‌ ముఖ్యమంత్రి మరియం నవాజ్‌ 100 మిలియన్ల పాక్ కరెన్సీ ఇవ్వనున్నారు. అలాగే పంజాబ్‌ గవర్నర్‌ సర్దార్‌ సలీం హైదర్‌ ఖాన్ 2 మిలియన్‌ రివార్డు ప్రకటించారు. ఇక సింధ్‌ ముఖ్యమంత్రి 50 మిలియన్‌ మొత్తాన్న.. గవర్నర్‌ 1 మిలియన్‌ ఇవ్వనున్నారు. వీటితో పాటూ నదీమ్‌ సూపర్ పెర్ఫామెన్స్ నచ్చి ప్రముఖ పాకిస్థాన్‌ సింగర్‌ అలీ జఫర్‌ అతనికి 1 మిలియన్ పాక్ కరెన్స ఇవ్వనున్నట్లు ప్రకటించారు. క్రికెటర్ అహ్మద్ షాదాజ్ కూడా వన్ మిలియన్ పాక్ డబ్బులు ఇవ్వనున్నారు.

వీటన్నిటితో పాటూ నదీమ్‌కు పాక్ ప్రభుత్వం తమ దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని కూడా ఇవ్వనుంది. ఈ విషయాన్ని జాతీయ అసెంబ్లీ ప్రభుత్వానికి సిఫారస్ చేయడమే కాకుండా..ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే నదీమ్ పాక్‌కు చేరుకోగానే అతనిని బంగారు కిరీటంతో సత్కరించనుంది సింధ్ ప్రభుత్వం. అలాగే నదీమ్‌కు సోలార్‌ ఎనర్జీ సిస్టమ్‌ను అందించనున్నట్లు అక్కడి ప్రముఖ సోలార్‌ ఎనర్జీ కంపెనీ బీకన్‌ ఎనర్జీ ప్రకటించింది. ఇక సుక్కురులోని కొత్త స్పోర్ట్స్‌ స్టేడియానికి నదీమ్‌ పేరు పెట్టనున్నట్లు అధికారులు తెలిపారు. కరాచీలో అర్షద్‌ నదీమ్‌ అథ్లెటిక్స్‌ అకాడమీని ప్రారంభించనున్నట్లు నగర మేయర్‌ ముర్తుజా వహబ్‌ ప్రకటించారు.

Also Read:WHO: మళ్ళీ కలవరపెడుతున్న కోవిడ్..డబ్ల్యూహెచ్‌వో వార్నింగ్

#pakistan #arshad-nadim #athlete #gold-medal
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe