Massage : నొప్పులు ఉన్న మసాజ్‌ చేస్తే ప్రాణాలకే ప్రమాదం.. ఎందుకంటే..?

పాత కాలంలో ఏదైనా శరీర అవయవం బెణికినా, నొప్పిగా ఉన్నా నాటు వైద్యంలో నూనె రాసి మసాజ్‌ చేసేవాళ్లు. నొప్పి ఉంటే నూనె, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ క్రీమ్‌లు రాస్తే ప్రాణాలకే ప్రమాదమని నిపుణులు అంటున్నారు. మాసాజ్‌ వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్‌లోకి వెళ్లండి.

New Update
Massage : నొప్పులు ఉన్న మసాజ్‌ చేస్తే ప్రాణాలకే ప్రమాదం.. ఎందుకంటే..?

Body Pains : చాలా మంది ఏదైనా నొప్పి వస్తే నూనె లేదా యాంటీ ఇన్‌ఫ్లమేటరీ క్రీమ్‌(Anti-Inflammatories Creams) లు రాస్తుంటారు. ఇలా చేయడం వల్ల ప్రాణాలకే ప్రమాదం(Life Risk) అని నిపుణులు అంటున్నారు. పాత కాలంలో నాటు వైద్యంలో ఏదైనా శరీర అవయవం బెణికినా, నొప్పిగా ఉన్నా నూనె రాసి మసాజ్‌ చేసి నయం చేసేవాళ్లు. ఇప్పటి వరకు నాటు వైద్యం వికటించిన దాఖలాలు లేవు. ఎక్కువ శక్తిని వాడి గట్టిగా మసాజ్‌ చేస్తే ప్రమాదమని తెలిసిన వాళ్లు మాత్రం బెణికిన చోట కాస్త క్రీమ్‌రాస్తే సరిపోతుందని అంటుంటారు.

publive-image

గట్టిగా మసాజ్‌(Body Massage) చేయడం వల్ల కొన్ని సార్లు ప్రాణాలకే ప్రమాదం అని అనేక సార్లు రుజువైంది. ఓ యువకుడు ఆడుకుంటుండగా కాలి మడిమకు గాయమైతే నరాల్లో రక్తం గడ్డకట్టింది. కొడుకు బాధ‌ను చూడ‌లేక తల్లి కాలికి గట్టిగా మర్దనా చేసింది. దీంతో గడ్డకట్టిన రక్తం నేరుగా గుండెకు చేరి అతను మరణించాడు. ఆమె తెలియక చేసిన తప్పు కుమారుడి ప్రాణాలు తీసింది. అందుకే రక్తం గడ్డకట్టినప్పుడు వైద్యుల సలహా మేరకు మందులను వాడితే కరిగిపోతుంది.

publive-image

లోపలి రక్తనాళాల్లో రక్తం గడ్డకడితే మాత్రమే ఇలాంటి మరణాలు సంభవిస్తాయని, కట్టు తీసిన తర్వాత కూడా నొప్పి తగ్గకపోతే వైద్యులను సంప్రదించాలని, సొంత వైద్యం చేసుకోకూడదని నిపుణులు సలహా ఇస్తున్నారు. మార్కెట్‌లో లభించే రకరకాల నూనెలు వాడి మసాజ్‌లు చేయకూడదని, ఇష్టానుసారం కట్లు కట్టినా రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ కాలంలో తెలిసీ తెలియని కొందరు నాటువైద్యుల దగ్గరికి వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోకూడదని సలహా ఇస్తున్నారు. నొప్పి తగ్గిపోతుందిలే అని లైట్‌ తీసుకుంటే రిస్క్‌ అంటున్నారు.

ఇది కూడా చదవండి: కష్టపడకుండానే కొవ్వును కరిగించుకునే అద్భుత చిట్కా

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
తాజా కథనాలు