pacific lamprey fish:45 కోట్ల ఏళ్ళ చేప...ఇప్పటికీ జీవించే ఉన్నాయి.

ఒకప్పుడు ఉన్న జీవరాశులు ఇప్పుడు లేవు. ఇప్పుడున్నవి అప్పుడు లేవు. మమోత్, డైనోసార్లు కాలగమనంలో అంతరించిపోయాయి. కానీ కోట్ల ఏళ్ళు అవుతున్నా ఓ చేప జాతి మాత్రం ఇంకా బతికే ఉన్నాయి. వాటి గురించి నమ్మలేని నిజాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి.

New Update
pacific lamprey fish:45 కోట్ల ఏళ్ళ చేప...ఇప్పటికీ జీవించే ఉన్నాయి.

ఈ భూమ్మీద మనకు తెలియని ఎన్నో విచిత్రాలు దాగి ఉన్నాయి. మనం కళ్ళతో చూడగలిగేవి కొన్ని అయితే చూడలేనివి, తెలుసుకోలేనివి మరికొన్ని. అలాంటి వాటిల్లో ఒకటే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న జలచరం. శాస్త్రవేత్తలకు కూడా పూర్తిగా అంతుబట్టని ఒక చేప గురించి తాజాగా వెలుగులోకి వచ్చింది. 45 కోట్ల ఏళ్ళ చరిత్ర ఉన్న ఈ చేప పేరు లాంప్రే. ఇది ఉత్తర పసిఫిక్ రీజియన్ లో మంచినీటి ప్రాంతాలలో కనిపిస్తుంది. ఇవి పసిఫిక్ మహా సముద్రం నుంచి కొలంబియా రివర్‌కు మైగ్రేట్ అయ్యాయి. దీని గురించి లైవ్ సైన్స్ అనే దానిలో ప్రచురించారు.

శాస్త్రవేత్తలు చెప్పిన ప్రకారం ఈ చేప ఒక వింత జీవి. సముద్రం అడుగునే ఉంటుంది. ఇది మిగతా చేపల్లా ఘన పదార్ధాలు తినదు. కేవలం ద్రవపదార్ధాలను తీసుకుంటుంది. అన్నికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే...లాంప్రే డైనోసార్ల రక్తాన్ని కూడా రుచి చూసిందిట. దీని వేట చాలా భయంకరంగా ఉంటుందిట. వేటాడిన జీవరాశుల రక్తాన్ని పీల్చి వాటిని చంపుతుంది. లాంప్రే మామూలు చేపల్లా కూడా ఉండదు. దీనికి అసలు దవడలే ఉండవు అని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. దవడలకు బదులుగా పళ్ళతో నిండిఉన్న పీల్చే నోరు ఉంటుంది. ఎరను పట్టుకోవడానికి, రక్తాన్ని తీయడానికి ఆ పళ్ళనే ఉపయోగిస్తుంది. ఇంతకన్నా ఆశ్చర్యకరమైన, వింతైన విషయం ఏంటంటే లాంప్రే చేపకు అసలు ఎముకలే ఉండవుట.

ప్రస్తుతం పసిఫిక్ రీజియన్ లో 40 రకాల లాంప్రే లు ఉనికిలో ఉన్నాయి. ఇవి నాలుగుసార్లు అంతరించేదశకు చేరుకున్నాయి కానీ ఉనికిని మాత్రం కోల్పోలేదు. ఎందుకంటే ఒక ఆడ లాంప్రే చేప 2లక్షల గుడ్లను ఒకేసారి పెడుతుంది. అందుకే వాటి సంతతి కాపాడబడుతోంది. పెద్దగా బయటకు కనిపించని ఈ లాంప్రే జాతి చేపల మీద శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. వీటి గురించి ఇంకా పూర్తిగా తెలుసుకోవలసి ఉందని వారుచెబుతున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు