మొజాంబిక్ (Mozambique) లో ఘోర ప్రమాదం జరిగింది. పడవ మునిగి సుమారు 90 మంది మృతి చెందారు. దేశ ఉత్తర తీరంలో పడవ ప్రమాదానికి గురై మునిగిపోవడంతో ఇలా పదుల సంఖ్యలో ప్రజలు చనిపోయినట్లు అక్కడి అధికార సంస్థలు ప్రకటించాయి. దాదాపు 130 మంది ప్రయాణికులు ఉన్న ఫిషింగ్ బోట్ నాంపులా ప్రావిన్స్ లో ఓ ద్వీపానికి వెళ్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది.
ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 91 మంది మృతి చెందగా... ఐదుగురిని ప్రాణాలతో కాపాడినట్లు నంపులా రాష్ట్ర కార్యదర్శి జైమ్ నెటో తెలిపారు. చనిపోయిన వారిలో ఎక్కువ మంది చిన్నారులు ఉన్నారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు అధికారులు వివరించారు. అయితే సముద్రం పరిస్థితులు అనుకూలించకపోవడంతో రెస్క్యూ ఆపరేషన్ కష్టం గా ఉన్నట్లు అధికారులు వివరించారు. చాలా మంది అక్రమంగా దేశాన్ని విడిచి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
పేద దేశాల్లో ఒకటైన మొజాంబిక్ తీవ్ర ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నట్లు ప్రపంచ గణాంకాలు చెబుతున్నాయి.
Also read: మోడీ రోడ్ షోలో ప్రమాదం.. వేదిక కూలి పలువురికి గాయాలు!