WhatsApp : వాట్సాప్ వాడే వారికి అలర్ట్.. 71 లక్షల ఖాతాలు క్లోజ్.. కారణమిదే!

భారతదేశంలో వాట్సాప్‌ తప్పుడు ఖాతాలను కేవలం నవంబర్ నెలలోనే 71 లక్షల ఖాతాలను నిషేధించింది. దానికి గల కారణాలను కూడా మెటా యజామాన్యం వివరించింది. వాట్సాప్‌ ఖాతాను సరిగా వినియోగించకపోతే చర్యలు తీసుకుంటామని కూడా యజామాన్యం హెచ్చరించింది.

New Update
WhatsApp : వాట్సాప్ వాడే వారికి అలర్ట్.. 71 లక్షల ఖాతాలు క్లోజ్.. కారణమిదే!

WhatsApp Alert : ప్రస్తుత కాలంలో వాట్సాప్(WhatsApp)  ఫోన్‌ లేదు అంటే అతిశయోక్తి కాదు. అయితే వాట్సాప్‌ యాజమాన్యం వినియోగదారులకు పెద్ద షాక్‌ నే ఇచ్చింది. భారత్ లో నవంబర్‌ నెలలో సుమారు 71 లక్షల కు పైగా వాట్సాప్‌ ఖాతాల(WhatsApp Accounts) ను యాప్‌ అధికారులు తొలగించారు. ఈ విషయం గురించి మెటా యజామాన్యం లోని ఇన్‌ స్టంట్‌ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ తన భారత్‌ మంత్లీ(Indian Monthly Report) నివేదికలో ఈ విషయం గురించి వెల్లడించింది.

తాజాగా జనవరి 1 2024న ప్రచురించిన నివేదికలో నవంబర్‌ 1 నుంచి నవంబర్‌ 30 వరకు గానూ మొత్తం మీద 71, 96,000 ఖాతాలను నిషేధించినట్లు కంపెనీ పేర్కొంది. వినియోగదారుల నుంచి కంపెనీకి అందిన ఆన్‌ లైన్ స్కామ్స్‌, ఫేక్‌ వార్తల ప్రచారం , ఆశ్లీల సమాచారం వంటి ఫిర్యాదుల నేపథ్యంలో ఆయా ఖాతాలపై చర్యలు తీసుకున్నట్లు వాట్సాప్ యజామాన్యం తెలిపింది.

ఇది మాత్రమే కాకుండా వాట్సాప్‌ ప్లాట్‌ ఫారమ్ ను సక్రమంగా వినియోగించని మరికొందరి ఖాతాలను కూడా తొలగించినట్లు తెలిపింది. ప్రస్తుతం భారతీయులు వినియోగించే వాట్సాప్‌ నంబర్‌ ని +91 ద్వారా గుర్తిస్తారు. ఈ క్రమంలో డిసెంబర్‌ లోనే వాట్సాప్‌ వినియోగానికి సంబంధించి మొత్తంగా 8841 ఫిర్యాదులు అందాయి.

ఆ ఫిద్యాదుల్లో 6 ఫిర్యాదులపై కంపెనీ చర్యలు తీసుకుంది. ఇది మాత్రమే కాకుండా గ్రీవెన్స్‌ అప్పిలేట్ కమిటీ నుంచి మరో 8 నివేదికలు అందాయని ప్రకటించింది. వాట్సాప్‌ దుర్వినియోగాన్ని ఎదుర్కోవడానికి కొత్త భద్రతా సాధనాల గురించి అనేక చర్యలను తీసుకుంటుంది.
ఇది మూడు స్థాయిలలో గుర్తించబడుతున్నట్లు కంపెనీ పేర్కొంది.

ఎవరైనా ఒక వినియోగదారు ఖాతాను గురించి నివేదించినట్లయితే వాట్సాప్‌ ప్రత్యేక బృందం దానిని పరిశోధిస్తుంది. అందులో ఉన్న లోటుపాట్లు గురించి కనుక యజామాన్యం గుర్తించినట్లయితే..విశ్లేషకుల బృందం దానిని పరిశోధిస్తుంది. ఆ తర్వాత ఆయా ఖాతా పై శాశ్వత నిషేధం చేయాలా వద్దా అనేది నిర్ణయం తీసుకుంటుంది. వాట్సాప్ గత కొన్ని నెలలుగా భద్రతా ఫీచర్లను నిరంతరంగా రూపొందిస్తోంది.

Also read: చలికాలంలో వీటిని తినడం వల్ల రోగాలకు బై బై!

Advertisment
Advertisment
తాజా కథనాలు