LayOffs: గడిచిన 20 రోజుల్లోనే 7,500 మందిని తొలగించిన దిగ్గజ టెక్‌ కంపెనీలు!

కొత్త సంవత్సరం మొదలై ఇంకా 20 రోజులు కూడా గడవక ముందే ప్రముఖ టెక్ కంపెనీలు తమ సంస్థల నుంచి సుమారు 7500 మంది ఉద్యోగులు ఉద్వాసన పలికాయి. రానున్న రోజుల్లో ఇవి మరింత ఎక్కువ కానున్నట్లు తెలుస్తుంది.

New Update
LayOffs: గడిచిన 20 రోజుల్లోనే 7,500 మందిని తొలగించిన దిగ్గజ టెక్‌ కంపెనీలు!

Tech Companies: కొత్త సంవత్సరం (New Year)  మొదలై ఇంకా 20 రోజులు కూడా కాలేదు. కానీ దిగ్గజ కంపెనీలు మాత్రం తమ కంపెనీల నుంచి ఇప్పటి వరకు సుమారు 7,500 మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలు కోల్పోవడం ఆందోళన చెందాల్సిన విషయం. ఎఫీషియెన్సీ(Effeciancy) పేరుతో పెద్ద పెద్ద టెక్‌ కంపెనీలు మళ్లీ లే ఆఫ్‌ ల మీద ఫోకస్‌ పెట్టాయి.

దిగ్గజ టెక్ కంపెనీలు అయినటువంటి అమెజాన్‌, గూగుల్‌ సంస్థలు కూడా తమ సంస్థల్లోని ఉద్యోగుల్లో కోతలు ఉంటాయని ప్రకటించాయి. ఏఐ ను పెంచి, అనవసరమై సెక్టార్స్ లో ఉద్యోగాలను కట్‌ చేసి తమ ఆర్థిక భారాన్ని తగ్గించుకోవాలని పెద్ద కంపెనీలు భావిస్తున్నాయి. గూగుల్‌ పేరెంట్‌ కంపెనీ ఆల్ఫాబెట్‌ ఇప్పటికే వేల మందికి బైబై చెప్పేసి ఇంటికి పంపేసింది.

గూగుల్ ఇలా..అమెజాన్ అలా..

ఇప్పటికే గూగుల్‌ అడ్వర్టైజింగ్‌, పిక్సెల్‌, ఫిట్ బిట్‌ తో పాటు అనేక విభాగాల్లో ఉద్యోగాల్లో కోతలు విధించింది. గూగుల్ ఇలా ఉంటే..అమెజాన్‌ కూడా గత వారంలోనే చాలా మందిని ఇంటికి పంపేసింది. దీని ప్రభావం స్ట్రీమింగ్‌ ఆడియో ఆపరేషన్స్‌ పై ఎక్కువగా పడింది. ఇలా 2024 మొదలైన 20 రోజుల్లోనే 7,500 మందికి పైగా ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు.

ఇదిలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా ఏఐ విప్లవం కనిపిస్తోంది. ఏఐని ఎంచుకున్న ప్రతి కంపెనీలో కూడా దాని ప్రభావం ఉద్యోగుల మీద చూపిస్తుంది. గతేడాది టెక్‌ సెక్టార్ లో 1,68,032 మంది ఉద్యోగాలు కోల్పోగా..అల్ఫాబెట్‌, అమెజాన్‌, మెటా, మైక్రోసాఫ్ట్‌ లో పరిస్థితులు సర్వత్రా చర్చకు దారి తీశాయి.

లే ఆఫ్‌ వార్తలు వింటనే టెక్‌ కంపెనీ ఉద్యోగుల్లో భయాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఏ వార్త ఎప్పుడూ వినాల్సి వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు.

Also read: చిరంజీవి హీరో కాదు..విలన్‌..అంటూ సీనియర్‌ నటి సంచలన వ్యాఖ్యలు!

Advertisment
Advertisment
తాజా కథనాలు