Medicine:ఇన్సులిన్ బదులు స్ప్రే...కొత్త మందు వచ్చేస్తోంది

మీరు డయాబెటిక్ పేషెంటా..రోజూ ఇన్సులిన్ తీసుకుంటున్నారా...సూదితో పొడుచుకుని పొడుచుకుని మీ శరీరం తూట్లు పడిపోతోందా...ఇక మీదట మీకు ఆ బాధ లేదు. ఇన్సులిన్ కు బదులు కొత్త మందు వచ్చేసింది.

New Update
Medicine:ఇన్సులిన్ బదులు స్ప్రే...కొత్త మందు వచ్చేస్తోంది

డయాబెటిక్స్ లేదా మధుమేహం...వందమందిలో 70 శాతం మందికి ఇది ఉంటుంది. ఒకప్పుడు ఇదొక పెద్ద వ్యాధి. కానీ ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. మారిన జీవనపద్ధుతులు, ఆహారపు అలవాట్లు దీనికి కారణం. అయితే డయాబెటిక్స్ లో మళ్ళీ హెచ్చు తగ్గులుంటాయి. కొంతమందికి సుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే...కొంతమందికి తక్కువగా ఉంటాయి. ఈ లెవల్స్ బట్టే మెడిసిన్స్ ఇస్తారు డాక్టర్లు. మధుమేమం టైప్ 2 పేషెంట్లలో సుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే ఇన్సులిన్ వాడాల్సి వస్తుంది.

Also Read:భారత్-శ్రీలంక మ్యాచ్..టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లంక టీమ్

ఇన్సులిన్ వాడకం ఓ పెద్ద బాధ. దీన్ని ఇంజెక్షన్ ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది. రోజూ రెండు పూటలా కూడా ఇంజెక్షన్ చేసుకోవాలి. ఇలా చేసుకుని చేసుకునీ కొన్ని రోజులకు శరీరం తూట్లు పడిపోతుంది. పైగా ఆ ఇంజెక్షన్ నొప్పిని రోజూ భరించాల్సి ఉంటుంది. అంలాటి వారికి శుభవార్త చెప్పాయి హైదరాబాద్ కు చెందిన బయోటెక్ కంపెనీలు. ఇన్సులిన్ స్థానంలో ఓజులిన్ అనే స్ప్రే ను ఇంట్రడ్యూస్ చేస్తున్నాయి.

నీడిల్‌ఫ్రీ టెక్నాలజీ ప్రవైట్ లిమిటెడ్, ఆర్అండ్‌డీ కంపెనీ ట్రాన్స్‌జీనీ బయోటెక్ కంపెనీ సంయుక్తంగా కలిసి ఓజులిన్ స్ప్రేనఉ తీసుకువస్తున్నాయి. దీనఇ అప్రూవల్ కోసం సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ కి పంపించాయి కంపెనీలు. అక్కడ కూడా కనుక దీనికి ఆమోద ముద్ర పడిపోతే ఓజులిన్ స్ప్రే మార్కెట్లోకి వచ్చేస్తుంది. నీడిల్‌ఫ్రీ ఇంతకు ముందే గ్లోబల్‌గా 40 దేశాల్లో ఓరల్ ఇన్సులిన్ కోసం అనుమతులను కూడా పొందింది అని చెబుతున్నారు. ఈ డయాబెట్ఇక్స్ స్ప్రేతో పాటూ ఈ కంపెనీ క్యాన్సర్, ఓస్టియోప్రోసిస్, అల్జైమర్స్ లాంటి వ్యాధులకు కూడా నాసల్ స్ప్రేను కనిపెట్టే పనిలో ఉంది.

Also Read:మేడిగడ్డ బ్యారేజిని సందర్శించిన రాహుల్

Advertisment
Advertisment
తాజా కథనాలు