Benjamin Basumatary: కరెన్సీ నోట్లపై నిద్రించడానికి కారణం అదే.. క్లారిటీ ఇచ్చిన నేత అస్సాంలోని ఓ రాజకీయ నేత బెంజమిన్ బసుమతరీ నోట్లు వేసి వాటిపై పడుకున్న ఫొటోలు వైరల్ కాగా ఆయనపై తీవ్రంగా విమర్శలు వచ్చాయి. దీనిపై స్పందించిన బసుమతరీ అది ఐదేళ్ల క్రితం నాటి ఫొటో అని.. అప్పు తెచ్చిన డబ్బుతో సరదాకి అలా చేశానని చెప్పారు. By B Aravind 28 Mar 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Benjamin Basumatary: అస్సాంలోని ఉదల్ గిరి జిల్లాలో ఓ రాజకీయ నేత బెంజమిన్ బసుమతరీ మంచంపై ఐదువందల రూపాయల నోట్లు వేసి వాటిపై పడుకున్న ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఆయన బీజేపీ కూటమి అయిన యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ (United People's Party Liberal) నేత కావడంతో ఇది రాజకీయంగా దుమారం రేపింది. విపక్ష పార్టీలు బీజేపీ కూటమిపై, యూపీపీఎల్‌పై తీవ్ర విమర్శలు చేశాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన విపక్ష నేత దేబప్రద సైకియా 'ఇది అవినీతిని కళ్లకు కట్టినట్లు చూపించడమే' అని మండిపడ్డారు. వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. A malicious photo of Benjamin Basumatary has been widely spread by media and social media users associating it with UPPL. It has nothing to do UPPL or BTC Government. The photo was taken five years ago by Mr Basumatary’s friends while they were partying and he was blackmailed… pic.twitter.com/z7BZhPhHJh — Pramod Boro (@PramodBoroBTR) March 27, 2024 Also Read: కేజ్రీవాల్‌కు ఊరట..జైలు నుంచి పరిపాలన చేయోచ్చు అని చెప్పిన ఢిల్లీ హైకోర్టు దీంతో యూపీపీఎల్ పార్టీ ప్రెసిడెంట్ ప్రమోద్ బోరో ఈ వ్యవహారంపై ఇప్పటికే స్పందించారు. బసుమతరీని జనవరి 10, 2024న పార్టీ నుండి సస్పెండ్ చేశామని.. ఆయనకు తమ పార్టీతో సంబంధం లేదని తెలిపారు. మరోవైపు దీనిపై బెంజమిన్ బసుమతరీ కూడా స్పందించారు. అది ఐదేళ్ల క్రితం నాటి ఫొటో అని.. తాను పార్టీలో ఉన్నప్పుడు సరదాగ అప్పు తీసుకున్న డబ్బుతో అలా ఫొటో దిగానని క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటీజన Also Read: చదువును మధ్యలో వదిలేసిన వ్యక్తి రూ. 12వేలకోట్లకు అధిపతి! #telugu-news #national-news #assam #benjamin-basumatary మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి