Operation abujmarh: దద్దరిల్లుతున్న దండకారణ్యం..ఛత్తీస్ ఘడ్ లో ఆపరేషన్ అబూజ్మడ్?

ఛత్తీస్‌ఘడ్ దండకారణ్యం దద్ధరిల్లుతోంది. అక్కడ కేంద్రహోంశాఖ నిర్వహిస్తున్న ఆపరేషన్ ప్రహార్..పతాక స్థాయికి చేరుకుందని సమాచారం. నారాయణపూర్ జిల్లాలోని పీఎల్జీఏ ప్రధాన స్థావరం అబూజ్మడ్ ను భద్రతాబలగాలు చుట్టుముడుతున్నాయి.

New Update
Operation abujmarh: దద్దరిల్లుతున్న దండకారణ్యం..ఛత్తీస్ ఘడ్ లో ఆపరేషన్ అబూజ్మడ్?

Chhattisgarh:మావోయిస్టు వ్యతిరేక కార్యాకలాపాలను తీవ్రతరం చేస్తోంది కేంద్ర హోంశాఖ. మావోయిస్టులను పూర్తిగా అణిచివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఆపరేషన్ ప్రహార్, ఆపరేషన్ అబూజ్మడ్‌లను నిర్వహిస్తోంది. ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలోని పీఎల్జీఏ ప్రధాన స్థావరం అయిన అబూజ్మడ్ ను భద్రతాబలగాలు చుట్టుముడుతున్నాయి. ఛత్తీస్ ఘడ్ లో అధికార మార్పిడి అనంతరం రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కేంద్రం దండకారణ్యంలో భారీగా బలగాలను మోహరిస్తోంది. అబూజ్మడ్ దండకారణ్యాన్ని బీఎస్ఎఫ్, కోబ్రా, డీఆర్జీ, ఐటీబీపీ, సీఆర్పీఎఫ్ కు చెందిన పదివేల మందికి పైగా భద్రతాసిబ్బంది చుట్టుముట్టారు. మరోవైపు మావోయిస్టులు తప్పించుకోకుండా ఛత్తీస్ ఘడ్ కు సరిహద్దులో ఉన్న రాష్ట్రాల భద్రతాబలగాలను, ఇంటలిజెన్స్ వర్గాలను కేంద్ర హోంశాఖ అప్రమత్తం చేసింది. మావోయిస్టుల రాకపోకలను నిరోధించేందుకు ప్రభావిత ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేస్తున్నారు.

Also read:టీ20 వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది..జూన్ 9న ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్

ఇక గతంలోనూ అబూజ్మడ్ ను చేధించేందుకు కేంద్రహోంశాఖ విశ్వప్రయత్నం చేసింది. మహారాష్ట్ర - ఛత్తీస్ ఘడ్ సరిహద్దులో 4,000 చ.కిమీ. పరిధిలో దట్టమైన అడవులతో కూడిన కొండ ప్రాంతం అబూజ్మడ్. ఇది చాలా రోజుల నుంచి మావోయిస్టులకు హెడ్ క్వార్టర్స్ గా మారింది. దాంతో పాటూ మావోయిస్టు అగ్రనేతల షెల్టర్ జోన్ గా, శిక్షణా కేంద్రంగా, మిషనరీ స్థావరంగా కూడా ఉంటోంది. అయితే చాలా పెద్ద అడవి అయినందువల్ల ఇక్కడ మావోయిస్టులను పట్టుకోవడం కష్టతరం అవుతోంది. అందుకే ఇంతకు ముందు కేంద్రహోంశాఖ ప్రయత్నాలు ఏమీ ఫలించలేదు.

మరోవైపు కేంద్రహోంశాఖ చర్యలు అక్కడి గిరిజనలను ఇడ్డంది పెడుతున్నాయి. అబూజ్మడ్ అడవులను భద్రతాబలగాలు చుట్టుముట్టడంతో గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. సైనిక చర్యతో గ్రామాలను వదిలి ఇతర ప్రాంతాలకు వేలమంది గిరిజనులు వలస వెళుతున్నారు.

Advertisment
తాజా కథనాలు