బీకేర్ ఫుల్.. నీళ్లు అతిగా తాగి మరణించిన మహిళ

అమెరికాలో ప్రస్తుతం ఎండలు దంచికొడుతున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో జనం అల్లాడిపోతున్నారు. భయటకు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. ఈ క్రమంలో ఇండియానాకు చెందిన యాష్లే సమ్మెర్స్ అనే మహిళ.. ఫ్యామిలీతో కలిసి బయటకు వెళ్లింది. ఎండ వేడిని భరించలేక ఆమె డీహైడ్రేట్ కు గురయ్యింది. దీంతో కేవలం 20 నిమిషాల్లోనే రెండు బాటిల్స్ నీరు తాగేసింది. ఆ తర్వాత కొద్ది నిమిషాలకే తనకు తలనొప్పిగా, వికారంగా, నీరసంగా ఉందని..

బీకేర్ ఫుల్.. నీళ్లు అతిగా తాగి మరణించిన మహిళ
New Update

నీళ్లు ఎక్కువగా తాగితే ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలిసిన విషయమే. ఇదే విషయాన్ని వైద్యులు కూడా చెబుతూంటారు. అందులోనూ వేసవి కాలంలో పండ్ల రసాలు, మజ్జిగ, నీరు వంటివి ఎక్కువగా తీసుకోకపోతే శరీరం డీహైడ్రేషన్ కు గురయ్యే ప్రమాదం ఉంది. కానీ మోతాదుకు మించి తాగితే.. నీళ్లు కూడా విషం అవుతాయనే విషయం మీకు తెలుసా?. ఏదైనా అతిగా తీసుకుంటే మన ప్రాణాలకే ముప్పు. అది నీళ్లైనా సరే. తాజాగా ఓ మహిళ అతిగా నీళ్లు తాగి.. ప్రాణాలు కోల్పోయింది. ఏంటి షాక్ అయ్యారా? నిజమేనండి. అమెరికాకు చెందిన ఓ 35 ఏళ్ల మహిళ.. ఎండ వేడిని భరించలేక.. 20 నిమిషాల్లో రెండు లీటర్ల నీళ్లు తాగింది. అనంతరం ప్రాణాలు కోల్పోయింది.

వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలో ప్రస్తుతం ఎండలు దంచికొడుతున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో జనం అల్లాడిపోతున్నారు. భయటకు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. ఈ క్రమంలో ఇండియానాకు చెందిన యాష్లే సమ్మెర్స్ అనే మహిళ.. ఫ్యామిలీతో కలిసి బయటకు వెళ్లింది. ఎండ వేడిని భరించలేక ఆమె డీహైడ్రేట్ కు గురయ్యింది. దీంతో కేవలం 20 నిమిషాల్లోనే రెండు బాటిల్స్ నీరు తాగేసింది.

ఆ తర్వాత కొద్ది నిమిషాలకే తనకు తలనొప్పిగా, వికారంగా, నీరసంగా ఉందని చెప్పడంతో వెంటనే ట్రిప్ కాన్సిల్ చేసుకుని ఇంటికి తిరిగి వచ్చేశారు. కానీ ఆమె ఇంట్లో అడుగు పెట్టకుండానే.. కారులోనే కుప్పకూలిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే ఆమె బ్రెయిన్ డెడ్ అయి చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. హఠాత్తుగా యాష్లే సమ్మెర్స్ మరణించడంతో.. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

కాగా నీరు తాగితే చనిపోవడం ఏంటని అందరూ ఆలోచించవచ్చు. దీనిపై డాక్టర్లు కూడా వివరణ ఇచ్చారు. అతిగా నీరు తాగడం వల్ల శరీరంలో హర్మోన్ల బ్యాలెన్స్ తప్పుతుందనీ, కిడ్నీలకు అతిగా నీరు చేరుతుందని చెప్పారు. దీని వల్ల శరీరంలోని రక్తం నుంచి సోడియం, పొటాషియం పెద్ద మొత్తం బయటకు వచ్చేస్తాయి. ఫలితంగా కండరాల నొప్పి, వికారం, తలనొప్పి, గొంతు నొప్పి, నీరసం వంటివి తలెత్తుతాయి. ప్రస్తుతం కేసులో ఆ మహిళ అతిగా నీటిని తీసుకోవడం వల్ల బ్రెయిన్ డెడ్ కు గురైందని పేర్కొన్నారు.

బయట ప్రదేశాల్లో ఎక్కువ సమయం పనిచేసేవారు, అతిగా జిమ్‌, వర్కవుట్లు చేసేవారు నీరు తాగుతారనీ.. వారికి తరచూ ఇలాంటి సమస్య వస్తుందని వివరించారు. శరీరంలో తగినంత ఉప్పు లేకుండా అతిగా నీరు తాగితే.. ప్రాణాంతకమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎలక్ట్రోలైట్స్, పొటాషియం, సోడియం కలిసిన ద్రవాలు తాగాలని సూచిస్తున్నారు. ఇక యాష్లే గుండె, లివర్, ఊపిరితిత్తులు, కిడ్నీలు, ఎముకల టిష్యూలను.. ఐదుగురికి దానం చేసినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

#usa #viral-news #two-litres-of-water #woman-dies #drinking-water
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి