Weather Update: తెలుగు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆగస్టు 29న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు ఐఎండీ తెలిపింది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో వార్మ్ రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. తెలంగాణలో 31న, ఏపీలోని కోస్తాంధ్ర, యానాంలో 29 నుంచి 31 మధ్య కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, తీరా ప్రాంతాల్లో తుఫాన్ హెచ్చరికలను వాతావరణ శాఖ జారీ చేసింది.
Weather Update: తెలుగు రాష్ట్రాలకు అలర్ట్.. వారం రోజులపాటు భారీ వర్షాలు!
వర్షాలపై భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో వారం రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
New Update
Advertisment